Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
వేజ్ బోర్డు సాధించాలంటే సింగరేణి ఎన్నికల్లో సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ ఐఎన్టీయూసీని గెలిపించాలని రాష్ట్ర జనరల్ సెక్రెటరీ సి.త్యాగరాజన్ కార్మికులకు పిలుపునిచ్చారు. శనివారం సింగరేణి గనులలో వివిధ పని ప్రదేశాలలో పిట్ మీటింగ్‌లో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబించుటవలన కార్మికులు నష్టపోతున్నారన్నారు. సంవత్సరాలు గడుస్తున్నా వేజ్ బోర్డు డిసైడ్ కావడం లేదన్నారు. ఏదో సాకులతో కాలాయపన చేస్తున్నా ప్రభుత్వాలకు, బుద్ధి చెప్పాలంటే కార్మికులందరూ ఐక్యంగా ఉండి ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలన్నారు. వేజ్ బోర్డును సాధించుకోవాలని అందుకు ఐఎన్టీయూసీ సిద్ధంగా ఉందని కార్మికులకు తెలియజేసినారు. రాబోయే సింగరేణి సంస్థ గుర్తింపు సంఘ ఎన్నికలలో ఐఎన్టీయూసీ గెలిపించాలని కార్మికులను కోరారు. పి.శ్యామ్‌ను ఫిట్ సెక్రటరీగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఉపాధ్యక్షులు వెలగపల్లి జాన్, డివివి సత్యనారాయణ, బి.రాజలింగు, బ్రాంచ్ సెక్రటరీ సతీష,్ నరసింహులు, టి.శ్రీను, కేదార్ వెంకటేశ్వర్లు, గోచికొండ సత్యనారాయణ, సంపత్ రెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు.