Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిషన్ భగీరథ నీళ్ల సమస్యలు పరిష్కరించాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-మణుగూరు
పినపాక నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పై పర్యవేక్షణ జరగాలని, నిధులు దుర్వినియోగం అయితే సహించేది లేదని అభివృద్ధి పనుల నిర్మాణంపై క్వాలిటీ పర్యవేక్షణ జరగాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. శనివారం సీపీఐ(ఎం) కార్యాలయంలో పాయం నరసింహారావు అధ్యక్షతన నియోజకవర్గస్థాయి సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల 50 కోట్లకు పైగా నిధులు నియోజకవర్గ అభివృద్ధి కోసం విడుదలైన విషయం తెలిసిందే అన్నారు. అభివృద్ధి పేరుతో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని అధికారులు కోరారు. కోట్లాది రూపాయలు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే ప్రకటించారన్నారు. పారదర్శకంగా గ్రామాల అభివృద్ధి కోసం ఉపయోగించాలన్నారు. నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. గత 15 రోజులుగా నియోజకవర్గంలో మిషన్ భగీరథ మంచినీళ్లు నామమాత్రంగా సరఫరా జరుగు తుందన్నారు. మంచినీటి సమస్య లేకుండా మిషన్ భగీరథ నీళ్లు అందించాలన్నారు. నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ప్రతి గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు సమస్య ఉన్నదన్నారు. మిషన్ భగీరథ నీళ్లు రాని గ్రామాలు అనేకం ఉన్నాయి అన్నారు. ఆ గ్రామాలకు మంచి సౌకర్యం ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రత్యేక చొరచూపాలన్నారు. 2018 నుండి బూర్గంపాడు మండలంలో సారపాకకు మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదన్నారు. అనేక ఆదివాసి గ్రామాల్లో దళిత గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదన్నారు. మిషన్ భగీరథ పథకం వలన ప్రత్యామ్నాయ నీటి వనరులు అంతరించి పోయాయన్నారు. వెంటనే సమస్య ఉన్న గ్రామాలలో మిషన్ భగీరథ నీళ్లు అందేలా చూడాలని అధికా రులు కోరారు. వేసవిలో ప్రజలకు మంచి సమస్య లేకుండా ప్రత్యేక చొరవతో మిషన్ భగీరథ నీళ్లు అందలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ సమా వేశంలో జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న, శ్రీనివాసరావు, కోడిశాల రాములు, పాయ నరసింహారావు, వెంకటేశ్వర్లు, కొమరం కాంతారావు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.