Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందరి సమిష్టి కృషి ఫలితమే రికార్డు
- ఇంజనీర్ ఎం.ప్రభాకర్ రావు
- ఉద్యోగ కార్మిక ఆర్టిజన్లకు శుభాకాంక్షలు
నవతెలంగాణ-పాల్వంచ
కొత్తగూడెం జిల్లా పవర్ స్టేషన్ ఐదు ఆరవ దశల కర్మాగారం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 2022 మార్చు 2023లో అధిక విద్యుత్ ఉత్పత్తి చేసి తెలుగు రాష్ట్రాల్లో అగ్ర గంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని అన్ని విద్యుత్పత్తి కేంద్రాల్లో కంటే ఈ కర్మగారం అధిక పీఎల్ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ) నమోదు చేసింది. ఉత్పత్తి లక్ష్యాన్ని అధికమించింది. 2021-2022 ఆర్థిక సంవత్సరానికంటే మంచి ఫలితాలను రాబట్టగలిగింది. గత ఆర్థిక సంవత్సరంలో పోల్చి చూసుకుంటూ ఈ ఆర్థిక సంవత్సరంలో వినియోగంలో పొదుపు పాటించింది. ఇదే సమయంలో నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేయడంలోనూ రికార్డు నెలకొల్పింది. పాల్వంచలోని కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ ఐదు ఆరవ దశ కర్మాగారంలో మొత్తం మూడు యూనిట్లలో1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం యూనిట్లు పనిచేస్తున్నాయి. దీనిలో 9, 10 యూనిట్లు ఒక్కొక్కటి 250 మెగావాట్లు ఆరోదశలోని ఒక యూనిట్ 500 మెగావాట్లు విద్యుత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 7191568 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసి 82.10 శాతం పిఎల్‌ఎఫ్‌ను నమోదు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ టీఎస్ జెన్కో ఏపీ జెన్కోలోను అన్ని విద్యుత్ పత్రిక కేంద్రాలతో పోటీపడి ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ కర్మగారం గత సంవత్సరం 72.78 శాతం పేర్లు సాధించి ఈ విద్యుత్పత్తిని ఈ సంవత్సరం అధిగమించడం విశేషం.
ఈ ఆర్థిక సంవత్సరంలో నెలకొల్పిన రికార్డులు
ఈ ఆర్ధిక సంవత్సరంలో కేటీపీఎస్ 5, 6 దశలు 82.10శాతం పీఎల్‌ఎఫ్‌తో 7191.680 మిలియన్ యూనిట్ల ఉత్పత్తిని సాధించి ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ఏపీ జెన్కో టీఎస్ జెన్కోలలోని స్టేషన్లతో పోటీ పడి మొదటి స్థానం సాధించింది. ఇది టీఎస్ జెన్కో మొత్తం జనరేషన్ వాటాలో 22.83శాతం కావటం విశేషం.
మరీ ముఖ్యంగా కేటీపీఎస్-5వ దశలోని 9వ యూనిట్ ఈ ఆర్ధిక సంవత్సరంలో నిరంతరాయంగా నడుస్తూ ఇదే యునిటపై గతంలో ఉన్న 144 రోజుల రికార్డును అలాగే 10వ యూనిట్ పై ఉన్న 222 రోజుల రికార్డును ఈ రోజు తో అధికమించి విజయవంతంగా ఉత్పత్తిని సాధించింది.
కేటీపీఎస్-5, 6 దశలలోని 10వ యూనిట్ 83.53 శాతం పీఎల్ ఎఫ తో రాష్ట్రంలో 2వ స్థానంలో, 11వ యూ నిట్ 83.10శాతం పీఎల్‌ఎఫ్‌తో 3వ స్థానంలో నిలిచింది.
అలాగే కేటీపీఎస్-5వ దశను చూసినట్లైతే..45 రోజులపాటు వార్షిక మరమ్మత్తు పనులు జరిగినప్పటికీ 82.27శాతం ఎవైలబులిటీతో 78.66శాతం పీఎల్ఎఫ్, 1722.58 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సాధించి ఉత్తమమైన పనితీరు కనబరిచింది.
కేటీపీఎస్-5, 6 దశలలో గత ఆర్ధిక సంవత్సరం కన్నా స్పెసిపిక్ ఆయిల్ కన్సప్షన్ గణనీయంగా తగ్గించుకొనటం ద్వారా ఈ ఆర్ధిక సంవత్సరంలో సుమారు 848.618 కిలో లీటర్ల ఆయిల్‌ను ఆదా చేయటం జరిగింది.
అలాగే కర్మాగారంలోని యూనిట్ల ఆక్సియలరీ పవర్ కన్సప్షన్ను తగ్గించి ఈ ఆర్ధిక సంవత్సరంలో 5.034 మిలియన్ యూనిట్లు ఆదా చేసింది. ట్రాన్స్‌కో వారి నిర్దేశితాల ప్రకారం యూనిట్ల ఎవైలబులిటీని 6వ దశలో 90.39శాతం అలాగే 5వ దశలో 82.27శాతం ఉంచటం ద్వారా అత్యుత్తమ ప్రతిభ కనబరచటం జరిగింది.
అందరి సమిష్టి కృషి ఈ ఫలితం సాధ్యపడింది
కర్మాగారంలో అధిక విధి ఉత్పత్తి చేయడం పట్ల చీఫ్ ఇంజనీర్ హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరి సమిష్టి కృషితో ఈ ఫలితం సాధ్యపడిందని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని పిలుపునిచ్చారు.
- కేటీపీఎస్ 5, 6 దశల చీఫ్ ఇంజనీర్ ఎం.ప్రభాకర్ రావు