Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులకు 12 నెలల పని దినాలు వేతనాలు విడుదల చేసిన సందర్భంగా ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం దమ్మపేట ఏటీవో కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి జై కేసీఆర్ జై తెలంగాణ అని నినాదాలు చేసి మిఠాయిలు తినిపించుకున్నారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట, అశ్వారావుపేట మండలాల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పని చేసే కాంట్రాక్టు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు టి.వెంకటేశ్వర్లు, కె.రాంబాబు, బి.నాగేశ్వరరావు, ఎన్.కిషన్, బి.రవి, ఇ.బాలకృష్ణ, చందర్, వెంకటేశ్వర్లు, కె.ముత్యాలరావు, బి.లక్ష్మీనర్సు, మహిళా అధ్యక్షురాలు వి.పాంచాలి, పి.సునీత, పుష్పాలత, భారతి, రజినీ, దుర్గ తదితరులు పాల్గొన్నారు.