Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.జె.రమేష్
నవతెలంగాణ-బూర్గంపాడు
కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ, కార్మిక, వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఐదు లక్షల మంది కార్మికులతో ఈ నెల 5న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మహా ధర్నా నిర్వహిస్తున్నామని, ఈ ధర్నాతోనైనా బీజేపీ తన విధానాలను మార్చుకోవాలని లేకపోతే కార్మిక వర్గం మరింత చైతన్యంతో బీజేపీ పాలన మెడలను వంచుతామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే రమేష్ అన్నారు. ఐటీసీ కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ అధ్యక్షులు పాషా అధ్యక్షతన శనివారం జరిగిన గెట్ మీటింగ్లో ఏ.జె.రమేష్ మాట్లాడారు. గత తొమ్మిది సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాన్ని అమలు చేస్తూ సంపద సృష్టికర్తలుగా ఉన్న కార్మికులను, రైతులను, వ్యవసాయ కార్మికులను విమర్శిస్తుందని ఆయన పేర్కొన్నారు. బ్రిటిష్ కాలంలోనే కార్మిక హక్కుల కోసం వీరోచితమైన పోరాటాలు జరిగి 41 కార్మిక చట్టాలను కార్మిక వర్గం సాధించుకుందని మోడీ ప్రభుత్వం ఈ కార్మిక చట్టాలు రద్దుచేసిందని ఆయన అన్నారు. వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని పెట్టుబడుదారులు మరింత దోపిడీ చేసే విధంగా విధానాలను రూపొందించి అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ నాయకులు బత్తుల గోపాలరావు, చంద్రశేఖర్, ఆరోన్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం రూరల్ : ఎఫ్రిల్ 5వ తేదీన దేశ రాజధాని ఢిల్లీ పార్లమెంటు ఎదుట లక్షలాదిమంది సంపద సృష్టికర్తలైనటువంటి కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు ధర్నా నిర్వహిస్తున్నారని ఇది మెదీ ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై సమరం అని సీఐటీయూ తెలిపింది. ఢిల్లీలో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కే.బ్రహ్మచారి పిలుపునిచ్చారు. చలో ఢిల్లీ ప్రచార కార్యక్రమంలో భాగంగా భద్రాచల పట్టణంలో వివిధ రంగాల కార్మికులతో సభలు సమావేశాలు నిర్వహించారు. ప్రతి కార్మికుడికి కరపత్రాలు పంపిణీ చేసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మచారి మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలను ఇష్టానుసారంగా పెంచుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో. పట్టణ నాయకులు నకిరికంటి నాగరాజు, నాయకులు జాకీర్, రాజబాబు, రాము, శ్రీను తదితరులు పాల్గన్నారు.
బూర్గంపాడు : 5న చేపట్టబోయే కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ ర్యాలీని జయప్రదం చేయాలని సీఐటీయూ మండల కన్వీనర్ బర్ల తిరుపతయ్య అన్నారు. శనివారం బూర్గంపాడు పారిశ్రామిక ప్రాంతాలతో గేట్ మీటింగ్స్, మండల కేంద్రంలో కరపత్రాల పంపిణీ, ప్రచార కార్యక్రమం నిర్వహించి, మాట్లాడారు. ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు వెంకన్న, పుల్లయ్య, రైతు సంఘం నాయకులు కందుకూరి నాగేశ్వరరావు, ప్రతాప్, లక్ష్మి, ప్రశాంత్, ఎల్ యెన్ ఫ్యాక్ వెంకటరావు పాల్గొన్నారు.