Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
బొగ్గు ఉత్పత్తి, రవాణాలో ప్రతి సంవత్సరం నిర్దేశిత వార్షిక లక్ష్యాలను సాధించడంలో మణుగూరు కొత్త రికార్డులు సాధించిందని ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ తెలిపారు .శనివారం జీఎం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ మార్చి నెలలో మణుగూరు ఏరియాలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 10.97 లక్షల టన్నులకు గాను 5.13 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించడమైందన్నారు. మార్చి నెలలో సాధించిన ఉత్పత్తి 47 శాతం సాధించిందన్నారు. 01 ఏప్రిల్ 2022 నుండి 31 మార్చి 2023 వరకు ప్రోగ్రెస్సిపి బొగ్గు ఉత్పత్తి 116 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 118.87 లక్షల టన్నుల సాదించడం జరిగిందన్నారు. అనగా 102 శాతం సాధించి రికార్డులు సృష్టించిందన్నారు. మార్చి నెలలో మణుగూరు ఏరియా 10.62 లక్షల టన్నులను రవాణా చేయటం జరిగిందన్నారు. 01ఏప్రిల్ 2022 నుండి 31 మార్చి 2023 వరకు ప్రోరెస్సివ్గా 126.66 లక్షల టన్నులు రవాణా రవాణా చేయడం జరిగింది అన్నారు. మార్చి నెలలో ఓవర్ బర్డెన్ డిపార్ట్ మెంటల్‌గా 15.00 లక్షల క్యూబిక్ మీటర్లకు లక్ష్యానికి గాను 120శాతంతో 17.97 లక్షల క్యూబిక్ మీటర్లు ఓబి తీయడం జరిగిందన్నారు. అలాగే 01 ఏప్రిల్ 2022 నుండి 31 మార్చి 2023 వరకు 150.15 లక్షల క్యూబిక్ మీటర్ల తీశామన్నారు. ఇది 88 శాతం అని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఓటు జీఎం డి.లలిత కుమార్, ఏజెంట్ (కేపియుజి) జి.నాగేశ్వరరావు, ఏజీఎం సివిల్ డి.వెంకటేశ్వర్లు, ఏరియా ఇంజనీర్ నర్సిరెడ్డి, పిఓ ఎంఎం జిఓసి శ్రీనివాసచారి, డిజిఎం ఐఈడి కె.వెంకటరావు, డీజీఎం పర్సనల్ ఎస్.రమేష్, డివైసిఎంఓ మేరీ కుమారి, ఫైనాన్స్ మేనేజర్ అనురాధ, ఎస్టేట్ అధికారి బాబుల్ రాజ్, సెక్యూరిటీ అధికారి, తదితరులు పాల్గొన్నారు.