Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రదీప్ కుమార్‌ను ప్రత్యేకంగా అభినందించిన ఎమ్మెల్యే సండ్ర
నవతెలంగాణ-ఖమ్మం
మూడేండ్ల బాలుని కారు ఢకొీని ఛాతీపై నుండి కారు వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్లీహం, క్లోమం, మెదడు, ఊపిరితిత్తులు తదితర మల్టీ ఆర్గాన్స్ దెబ్బతిన్నాయి. ఆ చిన్నారిని ఖమ్మంలోని కూరపాటి చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కూరపాటి ప్రదీప్‌కుమార్ కాపాడడంతో పలువురు అభినందిస్తున్నారు. వివిధ ఆర్గాన్స్ డ్యామేజీ కావడంతో ఆపరేషన్ చేసే అవకాశం లేని పరిస్థితుల్లో కేవలం మందులతోనే బాలుని కోలుకునేలా చేసి బాలుని తల్లిదండ్రులతో క్షేమంగా ఇంటికి చేర్చడంతో ఆ తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరిసింది.
సత్తుపల్లిలోని గాంధీనగర్‌లో మార్చి 24 మధ్యాహ్నం 12గంటల సమయంలో ఆరు బయట ఆడుకుంటున్న మూడేండ్ల చిన్నారి మనోజ్ఞను కారు ఢకొీని చాతీపై నుండి కారు వెళ్లడంతో తల, మెదడు, ప్లీహం, క్లోమం, ఊపిరితిత్తులు తదితర ఆర్గాన్స్‌కు బలమైన గాయాలయ్యాయి. తీవ్రంగా రక్తపు వాంతులు, ఇంటర్నల్ బ్లీడింగ్ కావడంతో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. శరీర భాగాలకు బాగా దెబ్బలు తగలడంతో పరిస్థితి సీరియస్‌గా మారింది. బాలుడి తల్లిదండ్రులు దీప్తి, అప్పారావు వెంటనే స్థానికంగా సత్తుపల్లిలోని చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో బాలున్ని తీసుకుని ఖమ్మంలోని కూరపాటి చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. అక్కడ డాక్టర్ కూరపాటి ప్రదీప్‌కుమార్ బాలున్ని పరిశీలించి కడుపు ఉబ్బరంగా ఉబ్బిపోయి, లోపల బ్లీడింగ్ అవుతున్న పరిస్థితిని బట్టి చిన్నారికి సిటీ స్కాన్, అల్ట్రా స్కాన్ చేయించారు. అయినా ఇంటర్నల్ బ్లీడింగ్ తగ్గక పోవడంతో సిటీ ఆబ్డామిన్ స్కాన్ చెయ్యడంతో బాలుని క్లోమం, ప్లీహం, ఊపిరితిత్తులు, తదితర భాగాలకు దెబ్బలు తగిలి, ఆయా భాగాల్లో బ్లీడింగ్ అవుతున్నట్టు స్కాన్ ద్వారా నిర్దారించారు. ప్రధానంగా ప్లీహం, క్లోమం కట్ అవడంతో బ్లీడింగ్ అవుతోంది. ఈ పరిస్థితుల్లో కూరపాటి ప్రదీప్ కుమార్ ప్రముఖ చిల్డ్రన్స్ సర్జన్లతో మాట్లాడంతో సర్జరీ చేస్తే చిన్నారి ప్రాణాలకు ముప్పని సాధ్యమైనంత మేరకు మెడిసిన్‌తోనే వైద్యం అందించాల్సి ఉందని సలహా ఇచ్చారు. ఆ ప్రమాదంలోనే చిన్నారి తలకు బలమైన గాయం కూడా కావడంతో మెదడు భాగానికి కూడా దెబ్బ తగిలి సీఎస్ఎఫ్ రైనోరియా వల్ల ముక్కునుండి నీరు కారుతుండటంతో న్యూరో సర్జన్లతో మాట్లాడి డా.ప్రదీప్‌కుమార్, డాక్టర్. బ్రహ్మకుమార్ ఇరువురూ బాలున్ని తల్లిదండ్రులు అనుమతితో కూరపాటి చిల్డ్రన్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ప్రారంభించారు. చిన్నారిని కంటికి రెప్పలా కాపాడుతూ, ప్రతీ క్షణం అబ్జర్వేషన్లో ఉంచి, ప్రత్యేక శ్రద్ధతో పీడియాట్రిక్ వైద్య నిపుణులు కూరపాటి ప్రదీప్, బ్రహ్మకుమార్ అరుద్కెన వైద్యం అందించారు. రక్తం తక్కువగా ఉండటంతో అవసరమైన మేరకు రక్తం ఎక్కిస్తూ బాలునికి వైద్యం కొనసాగించారు. ఫలితంగా మూడు రోజుల్లోనే ఇంటర్నల్ బ్లీడింగ్ నిలిచిపోవడంతో పాటు ఆర్గాన్స్ అన్నీ మళ్లీ మునుపటి మాదిరిగానే పనిచెయ్యడం ప్రారంభించాయి. దీంతో వేగంగా కోలుకున్న చిన్నారిని శనివారం డిశ్చార్జి చేశారు. బాలుని తల్లిదండ్రుల మోములో ఆనందం వెల్లివిరిసింది. డాక్టర్ ప్రదీప్‌కుమార్‌ను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో పాటు పలువురు ప్రముఖులు, వైద్యనిపుణులు అభినందించారు.