Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిఆర్డిఏ జిల్లా మేనేజర్ దర్గయ్య
నవతెలంగాణ-కల్లూరు
ప్రభుత్వం కల్పిస్తున్న మహిళ ఆరోగ్య పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిఆర్డిఏ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ బానోత్ దర్గయ్య మహిళలను కోరారు. శనివారం తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉషోదయ మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో స్త్రీ శక్తి భవన్లో ఆరోగ్య మహిళా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో చెన్నూర్ ప్రాథమిక వైద్యశాల డాక్టర్ ఇస్రాత్ తబసుము మహిళా సంఘాల సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 8 రకాల వైద్య సౌకర్యాల గురించి ఆరోగ్య మహిళా కార్యక్రమాలను వివరించారు. చెన్నూరు పీహెచ్సిలో ప్రతి మంగళవారం ప్రతి స్వయం సహాయక సంఘంలో ఉన్న సభ్యురాలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ వెంకట రామారావు, సీసీలు వెంకటేశ్వర్లు, వెంకయ్య, సిహెచ్ శ్యామలాదేవి, రాజ్యలక్ష్మి, వెంకట రావమ్మ, రాధా రుక్మిణి, ఎస్తేరు, ఆనంద కుమారి, అపర్ణ, లక్ష్మి దీపికలందరూ పాల్గొన్నారు.