Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమ్మల నాగేశ్వరరావు, మెచ్చ నాగేశ్వరరావు
- పాడె మోసిన తాటి వెంకటేశ్వర్లు, జారె
నవతెలంగాణ-దమ్మపేట
ఈతరం ఆదర్శవంతమైన రాజకీయాలు నడిపి ఎంతోమంది రాజకీయ నాయకులకు, యువకులకు స్పూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తి నాయుడు చెన్నారావు అని ఆయన నమ్ముకున్న సిద్దాంతం కోసం చివరి వరకు పట్టువిడవకుండా రాజీ లేని నిబద్దత కలిగిన జీవితాన్ని గడిపాడని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అశ్వారావుపేట యం.ఎల్.ఎ మెచ్చా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అన్నారు. దమ్మపేట మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు, దమ్మపేట సొసైటీ వైస్ చైర్మన్ నాయుడు చెన్నారావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మద్యాహ్నం దమ్మపేటలో తన ఇంటి వద్ద మృతి చెందారు. ఈ వార్త మండలం మొత్తం వ్యాప్తి చెందగా మండలంలోని అన్ని పార్టీల నాయకులు, ప్రజాప్రతినిథులు నాయుడు చెన్నారావు అభిమానులు, పెద్ద సంఖ్యలో వచ్చి చెన్నారావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. చెన్నారావు లేని దమ్మపేట మండల రాజకీయ ముఖచిత్రాన్ని ఊహించుకోవడం కష్టంగా ఉందని చెన్నారావుకు, తమకు ఉన్న అనుబంధాన్ని ఆవేదనతో నేతలు గుర్తుచేసుకున్నారు. ఎమ్మెల్యే మెచ్చా కన్నీటి పర్యంతమయ్యారు. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, నాయుడు చెన్నారావు పాడెను మోస్తూ అంతిమయాత్రలో పాల్గొని స్మశానవాటిక వరకు వెళ్ళి అంత్యక్రియలు పూర్తయ్యేవరకు ఉన్నారు. ఇదే సందర్భంలో ఢిల్లీ పార్టీ సభలకు వెళ్ళుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపియం పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య ప్రత్యేకంగా నవతెలంగాణతో మాట్లాడుతూ తాను సభలు నిమిత్తం ఢిల్లీ వెళుతున్నానని నాయుడు చెన్నారావుకు తనకు ఉన్న అనుబంధాన్ని మాటల్లో వ్యక్తపరచడం సాధ్యం కాదని నాయుడు చెన్నారావు మరణ వార్త తనను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందని అన్నారు. నాయుడు చెన్నారావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. దమ్మపేట ప్రజలు తమకు కమిట్మెంట్గా పనిచేసే సిద్దాంతం కలిగిన ఒక వ్యక్తిని కోల్పోయామని కన్నీటి పర్యంతమవుతు భారీ స్థాయిలో నాయుడు చెన్నారావు అంతిమయాత్రలో ప్రజలు పాల్గొనడం చూపరులను సైతం కంటతడిపెట్టించింది. చిన్నవయసులోనే చెన్నారావు లాంటి నాయకుడిని కోల్పోవడం చాలా బాధాకరం అని ప్రజలు అంటున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ, యన్.డి. పార్టీ, టిఆర్యస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిథులు వివిధ పార్టీల కార్యకర్తలు, మండల ప్రజలు పాల్గొన్నారు.