Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ -పాల్వంచ
తడి, పొడి వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలపై రిసోర్స్ పర్సన్ షబాన సేవలను జిల్లా కలెక్టర్ అనుదీప్ అభినందించారు. జాతీయ స్థాయిలో స్వచ్ఛతపై అవార్డు సాదించిన సందర్భంగా శనివారం ఐడిఓసి కార్యాలయంలో అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహణపై అవార్డు సాధించడం చాలా సంతోషమని చెప్పారు. పరిసరాల పరిశుభ్రతకు వ్యర్థాలను ఎప్పటికపుడు పరిశుభ్రం చేస్తున్నానరని, వాటిని వర్ని కంపోస్టు తయారు చేయడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. పరిసరాలు పరిశుభ్రకు చేపట్టిన స్వచ్ఛతపై రిసోర్స్ పర్సన్ షబానా కేరళ రాష్ట్రంలోని, భువనేశ్వర్ లోని జిడ్ని, టెంకనాల్ మున్సిపాల్టీలను సందర్శించినట్లు చెప్పారు. ఆ మున్సిపాల్టీలలో మానవ మల, మూత్రాలను ప్లీకల్ స్లెడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంటు ద్వారా శుద్ధి చేయుట, ఎరువుగా తయారు చేయుట, ఆరోగ్య, ఆహార కేంద్రాలను, పచ్చళ్లు తయారు చేయు యూనిట్లు, పార్కులు, వైకుంఠ దామాలు నిర్వహణ తీరును పరిశీలించారని చెప్పారు. అనంతరం గత నెల 29వ తేదీన జాతీయస్థాయిలో ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో స్వచ్చతకు అవార్డు సాధించారని చెప్పారు. స్వచ్చత కార్యక్రమాలు నిర్వహణతో కొత్తగూడెం మున్సిపాల్టీ ఆదర్శంగా తయారవుతున్నదని, ప్రజలు కూడా స్వచ్ఛ కార్యక్రమాలకు సహాకారం అందిస్తూ ఇంటింటి నుండి వెలువడే వ్యర్థాలను మున్సిపల్ సిబ్బందికి అందచేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘు, ఏఈ రాము తదితరులు పాల్గొన్నారు.