Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు
నవతెలంగాణ-పినపాక
పినపాక మండలం ఉప్పాక పంచాయతీలో గల పొలాలకి, స్మశాన వాటికకు వెళ్లేదారిలో కల్వర్టు అకాల వర్షాల కారణంగా కూలిపోవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆదేశాల మేరకు ఇరిగేషన్ అధికారులు కల్వర్టు నిర్మాణాన్ని పరిశీలించారు. రైతులు ఈ సమస్యను అధికారులకు తెలియజేశారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుజాత, ఉప సర్పంచ్ గుంటుపల్లి రామారావు, పినపాక మండల సోషల్ మీడియా అధ్యక్షులు శ్యామల సతీష్, నాయకులు కళ్యాణం మల్లికార్జున్, ఏలబోయిన జనార్ధన్, మోటపోతుల నాగేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు.