Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్రమంగా లబ్ధిదారుల ఎంపిక
- ప్రజా ప్రతినిధులు... అధికారులే సూత్రధారులు గ్రీవెన్స్‌లో ఫిర్యాదుకు సిద్ధం
నవతెలంగాణ-కొత్తగూడెం
గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కల్పిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల ఎంపికలో ప్రజా ప్రతినిధులు, అధికారుల చేతివాటం ప్రదర్శించి అనర్హులను అర్హులుగా ఎంపిక చేయడం పరిపాటిగా మారింది. లబ్ధిదారుల ఎంపిచేసేందుకు గాను ఒక్కో లబ్ధిదారుల నుండి సుమారు రూ.30 వేలు వసూలు చేసి ఎంపిక చేసినట్టు లక్ష్మీదేవిపల్లి మండం పరిధిలో అరోపణలు వినిపిస్తున్నాయి.
లక్ష్మీదేవిపల్లి మండలంలో ట్రైకార్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల్లో అర్హుల ఎంపిక చేయకుండా అనర్హులను ఎంపిక చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఒక్కో లబ్ధిదారుల నుండి రూ.30వేలు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా మండల ప్రజా ప్రతినిధి ఎంపీపీ ప్రోద్బలంతో అధికారుల చేతివాటం ప్రదర్శించారని దరఖాస్తు దారులు ఆరోపిస్తున్నారు. లక్ష్మీదేవిపల్లి మండలంలో ఉన్న 31 పంచాయతీలో లబ్ధిదారుల ఎంపిక జరగాల్సి ఉన్నప్పటికీ కేవలం 4 పంచాయతీల్లో మాత్రమే లబ్ధిదారుల ఎంపిక జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆయా పంచాయితీల గ్రామ సభల ద్వారా అభ్దిదారుల ఎంపిక జరగాల్సి ఉంది, కానీ, మండల సర్వ సభ్య సమావేశంలో తీర్మాణం చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయంలో లక్ష్మీదేవిపల్లి ప్రజా ప్రతినిధులు కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఎంపికల వలన నిజంగా దరఖాస్తు చేసుకున్న వారికి ట్రైకార్ రుణాలు అందకపోవడంతో నిరుద్యోగ యువకులు లబోదిబోమంటున్నారు. మండలంలో సుమారు 870 మంది నిరుద్యోగులు ట్రైకార్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అధికార పార్టీకి చెందిన వారిని స్థానిక ఎమ్యెల్యే, ఎంపిపి ప్రమేయంతో పలువురుని ఎంపిక చేశారని, ఎంపిక చేసిన లబ్ధిదారులందరూ ధనిక వంతులని, అర్హత లేని వారిని ఎంపిక చేశారని ఆయా పంచాయితీల ప్రజలు ఆరోపిస్తున్నారు. దరఖాస్తు దారుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుణానికి ఎంపికి చేసినందుకు గాను ఒక్కొక్కరి నుండి రూ.30 వేలు అధికారులు లంచంగా తీసుకొని లబ్ధిదారుల ఎంపిక చేశారని పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తుతున్నాయి. ట్రైకార్ రుణాలు పొందినవారు ప్రభుత్వం కల్పించే సదుపాయం పొందే వారు కాదని, వచ్చిన రుణం దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నాయని ఆయ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. నిజమైన నిరుపేద నిరుద్యోగులైన యువకులకు రుణాలు అందిస్తే వారు, వారి కుటుంబం అభివృద్ది చెందే అవకాశం ఉంది. దానికి భిన్నంగా జరిగిన లబ్ది దారుల ఎంపికపై ఐటీడీఏ అధికారులు సైతం దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అర్హులైన వారికి రుణాలు అందజేయాలని, అనర్హులకు రుణాలు నిలిపివేయాలని దరఖాస్తుదారులు డిమాండ్ చేస్తున్నారు. మండలానికి రూ.1కోటి 80 లక్షలు మంజూరు జరిగిన విషయం అధికారులు స్పష్టంగా ప్రకటించారు. 180 మందికి ఒక్కోక్కరికి రూ.1లక్ష చొప్పున ట్రైకార్ రుణాలు పంపిణీ చేసే విధంగా జాబితాను సిద్దం చేశారని, లబ్దిదారులకు కసీస అర్హత, అవసరం లేకున్నప్పటికీ అధికారులకు ఎవరు డబ్బులు ఇస్తే వారిని ఎంపిక చేసినట్లు ఆరోపనలు ఉన్నాయి. కేవలం రూ.30 వేలు లంచంగా ఇచ్చిన వారిని మండల అధికారులు ఎంపిక చేసినట్లు తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఈ విషయంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు లేకపోలేదు. ముఖ్యంగా మండల ఎంపిపి తనకు చెందిన వారిని ఎంపికి చేసినట్లు లబ్దిదారుల నుండి ఆరోపణలు ఉన్నాయి. ట్రైకార్ రుణాల లబ్దిదారుల ఎంపికలో జరిగిన అవినీతి, అక్రమాలపై సోమవారం జరిగే గ్రీవెన్సీలో కలెక్టర్‌కు లక్ష్మీదేవిపల్లి మండల ప్రజలు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.
పారదర్శకంగా ఎంపికలు....ఎంపిడిఓ రామారావు
ట్రైకార్ రుణాల ఎంపికలో దరఖాస్తు చేసుకున్న వారి అర్హుతను బట్టి ఎంపిక చేయనున్నామని లక్ష్మీదేవిపల్లి ఎంపిడిఓ రామారావు తెలిపారు. ఎలాంటి అపోహలకు, అవినీతి అక్రమాలకు తావులేకుండా మరో 15రోజుల్లో లబ్దిదారుల ప్రక్రియ పూర్తి చేయన్నుట్లు తెలిపారు.