Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫోర్త్ క్లాస్ ఉద్యోగుల సంఘానికి టీఎన్జీవో యూనియన్ అండగా ఉంటది
- యూనియన్ జిల్లా అధ్యక్షులు అప్జల్ హసన్
నవతెలంగాణ-ఖమ్మం
సంఘానికి నిస్వార్థంగా సేవలు అందించాలని, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘానికి టీఎన్జీవో సంఘం ఎప్పుడూ ఉండగా ఉంటోందని టీఎన్జీవో యూనియన్ జిల్లా అధ్యక్షులు షేక్ అప్జల్ హసన్ అన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలోని జడ్పి హాల్లో నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం నూతన జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బిక్కు, రమణల అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో అయన మాట్లాడుతూ తన దృష్టిలో ప్రభుత్వ ఉద్యోగులందరూ ఒక్కటే అని, ఉద్యోగులకు ఏ సమస్య ఉత్పన్నమైనా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. జిల్లా టీఎన్జీవో సంఘం నూతన కార్యవర్గం అనతికాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. పనితీరుకు రాష్ట్ర నాయకత్వం మామిళ్ళ రాజేందర్, రాయకంటి ప్రతాప్ల మన్ననలను పొందిందని చెప్పారు. సంఘం పేరుతో, హౌసింగ్ సొసైటీల పేరుతో రూ.లక్షలు వసూలు చేస్తూ ఉద్యోగులను దోచుకుని తింటే సహించేది లేదని హెచ్చరించారు. ఉద్యోగులను మోసం చేసే నాయకుల పని పట్టేవరకు నిద్రపోనని స్పష్టం చేశారు. టీఎన్జీవో జిల్లా కార్యదర్శి ఆర్విఎస్. సాగర్, టౌన్ అధ్యక్షులు నాగుల్ మీరాలు మాట్లాడారు. తొలుత నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘానికి నూతనంగా ఎన్నికయిన అధ్యక్ష, కార్యదర్శులు బిక్కు, రమణలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో ఫోర్త్ క్లాస్ ఉద్యోగుల సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు కోడి లింగయ్య, సంఘం గౌరవ అధ్యక్షులు వెంకన్న, వసంతరావు, అలీ, బేగ్, అంజమ్మ, ఉద్యోగులు పాల్గొన్నారు.