Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత నామా నాగేశ్వరరావు
నవతెలంగాణ-వైరా
ఖమ్మం జిల్లా వైరా పట్టణ బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం పట్టణ అధ్యక్షులు మద్దెల రవి అధ్యక్షతన ఆదివారం స్థానిక ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో జరిగింది. ఆత్మీయ సమ్మేళనంలో పార్లమెంటరీ పక్ష నేత నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే లావుడియా రాములునాయక్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగిం చారు. ఎంపీ నామా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు బిఆర్ఎస్ పార్టీని స్థాపించారని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం పార్టీ కార్యకర్తల కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కి దక్కుతుందని అన్నారు. కార్యకర్తలు పార్టీ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. స్వర్గీయ సర్దార్ పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముల్లపాటి సీతారాములు, ఎంపీపీ వేల్పుల పావని, బిఆర్ఎస్ రూరల్ మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు, దిశా జిల్లా కమిటీ సభ్యులు కట్టా కృష్ణార్జునరావు, జిల్లా నాయకులు పసుపులేటి మోహన్‌రావు, మచ్చా బుజ్జి, మునిసిపల్ కౌన్సిలర్స్ వనమా విశ్వేశ్వరరావు, డాక్టర్ కోటయ్య, మాది నేని సునీత, మారికంటి డేడీ కుమారి, దారెళ్లి పవిత్ర కుమారి, డాక్టర్ కాపా మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.