Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పమ్మి గడ్డన పుట్టిన పోరు బిడ్డ...ఎర్రజెండా గుండెల నిండా నిలిచిన ధీరుడు
నవతెలంగాణ-ముదిగొండ
ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో పమ్మి గ్రామం అంధకారమై కాంగ్రెస్ భూస్వామి అరాచక శక్తులు ఊరు మీద పడి ప్రజలను ఆడ మగ అని తేడా లేకుండా బడుగు బలహీన వర్గాల బలహీనతలను ఆసరా చేసుకుని హింసకు గురిచేస్తూ దాడులకు పాల్పడుతూ దౌర్జన్యాలు దమనకాండ విశంఖలంగా చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్న రోజుల్లో పమ్మి గ్రామ ప్రజలకు అండదండగా నిలబడి వారి బతుకుల్లో వెలుగును నింపిన ఎర్రజెండా ముద్దుబిడ్డ చావా(సేవ)శంకరయ్య వర్థంతిని సోమవారం నిర్వహించనున్నారు. శంకరయ్య సిపిఐ(ఎం) పార్టీ కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటూ నిబద్ధత కలిగిన క్రమశిక్షణగల ప్రజానాయకుడు. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ భూస్వామ్య దౌర్జన్యాలను ఎదిరించి ఊరుని రక్షించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. బుగ్గవీటి రంగయ్య నాయకత్వాన చావా శంకరయ్య ప్రజలకు మార్క్సిస్టు పార్టీ ఆధ్వర్యంలో అనేక సేవలు అందించారు. శంకరయ్యతో పాటు మందా నారాయణ, రాయబారపు(బుడ్డయ్య) రామయ్య, రాయబారపు ముత్తయ్య, రాయబారపు(హక్కుల) నరసింహ, రాయబారపు వెంకయ్య, కోయ కోటేశ్వరరావు పార్టీలో ప్రధాన పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యల కోసం కృషి చేశారు. గ్రామంలో ప్రజలను చైతన్య పరుస్తూ అణగారిణ కులాలను ఐక్యం చేస్తూ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలను, అరాచకవాదుల ఆటలు కట్టించడంలో గ్రామంలో సిపిఐ(ఎం) పార్టీ ప్రధానపాత్ర పోషిస్తూ అనేక ప్రజా సమస్యలను పరిష్కరించి విజయాలు సాధించి ఆనాడు పమ్మి గడ్డన ఎర్రజెండాని ఎగరవేసి రెపరెపలాడించి ప్రజల పార్టీగా పంచాయతీని కైవసం చేసుకుని 30 సంవత్సరాలు గ్రామ అభివృద్ధికి కృషి చేసిన వారిలో చావా శంకరయ్య నిలిచారు. ఆరు దఫాలుగా జరిగిన పంచాయతీ ఎన్నికలలో బుగ్గవీటి రంగయ్య సర్పంచ్‌గా గెలిసి గ్రామంలో ప్రజలకు కనీస సౌకర్యాలతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించి ఊరు ప్రజలకు రక్షణగా నిలిచి కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాల నుండి ఊరిని కాపాడి ఆనాటి ప్రజలకు ఆత్మబంధువులుగా దళిత బహుజనులకు దండిగా వెన్నుదన్నుగా నిలిచి పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు సాధన విద్యను అందించటంలో గ్రామంలో పాఠశాల నిర్మాణం కరెంట్ సౌకర్యం ఏర్పాటు చేశారు. చావా శంకరయ్య సేవా శంకరయ్యగా మారి ప్రజలకు ఊరికి ఉపయోగకరమైన ప్రజా కార్యక్రమాలు ఎన్నో చేపట్టి పార్టీకి ప్రజలకు సేవాతత్పరుడుగా నిలిచారు. గ్రామంలో మార్కిస్టు పార్టీకి 40 సంవత్సరాల కాలంలో ప్రజలకు కూలి రేట్లు పెంపుదల కోసం ఉద్యమం చేసిన శంకరయ్య మూర్తిభవించిన మార్కిస్టు పార్టీ ధీరుడు. శంకరయ్య కుటుంబ సభ్యులు పార్టీ సేవా కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు.
శంకరయ్య సతీమణి చావా భారతమ్మ ఎంపీటీసీ సభ్యురాలుగా గెలిసి ప్రజలకు సేవలందించారు. శంకరయ్య పార్టీ పట్ల పార్టీ కార్యక్రమాల పట్ల ఎంతో విధేయుడుగా ఉండి వినమ్రంగా పనిచేసేవారు ప్రజలకు దళిత బహుజనులకు శంకరయ్య అంటే అమితమైన ప్రేమ. ఆయన కుటుంబసభ్యుల పట్ల కూడా ప్రజలు ఆదరాభిమానాలు చూపుతున్నారు. ఎర్రజెండాకు వన్నె తెచ్చి మండలంలోనే పమ్మి గ్రామంలో సిపిఎం పార్టీకి తిరుగులేదని పార్టీ జెండాను మోసి ప్రజలకు దగ్గరయ్యి ప్రజాభిమానాన్ని చూరగొన్న శక్తి శంకరయ్య. విరామము లేకుండా పార్టీ కోసం సేవలందిస్తున్న క్రమంలో అనారోగ్యానికి గురై1993 ఏప్రిల్ మూడో తేదీన ఆయన తుదిశ్వాస విడిచి ప్రజావీరుడిగా చరిత్ర లో నిలిచారు. ఈనెల మూడో తేదీన చావా శంకర య్య 30వ వర్ధంతి సంద ర్భంగా పార్టీ ఆధ్వర్యంలో గ్రామంలో ఘనంగా నివాళ్లు అర్పించనున్నారు.