Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటియు నిరసన
నవతెలంగాణ-పాల్వంచ
దసరా సినిమాలో అంగన్వాడీ ఉద్యోగులను గుడ్లు దొంగతనం చేసే ఉద్యోగులుగా చిత్రీకరించిన సన్నివేశాన్ని తక్షణమే తొలగించాలని, సినిమా పరిశ్రమ సెన్సార్ బోర్డును తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు భద్రాద్రి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నది. పట్టణంలోని దసరా సినిమా హాల్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐటీయూ పట్టణ కన్వీనర్ సత్య మాట్లాడుతూ దసరా సినిమాలో హీరోయిన్ వెన్నెల తన పాత్రను అంగన్వాడీ టీచర్ గా చూపించారన్నారు. ఇంతవరకు బానే ఉంది. కానీ ఒక సందర్భంలో సాయంత్రం సమయంలో అంగన్వాడీ టీచర్ సెంటర్‌కు తాళం తీసి, కొంగులో కోడిగుడ్లు దొంగతనంగా తీసుకెళ్తున్నట్లు డైరెక్టర్ చూపించారు. ఇది అత్యంత దుర్మార్గమని, చిరుద్యోగులను అవమానించడం తప్ప మరొకటి కాదని అన్నారు. వెంటనే ఆ సన్నివేశాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఐసిడిఎస్‌కు ముందుకు నడవడానికి అంగన్వాడీ ఉద్యోగుల పాత్ర చాలా కీలకంగా పని చేస్తున్నదన్నారు. ఇంత త్యాగం చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులను కించపరచడం సరైనది కాదని అన్నారు. అంగన్వాడీ టీచర్లని గుడ్లు దొంగతనం చేస్తున్న టీచర్‌గా చిత్రీకరించిన దసరా సినిమాలో సన్నివేశాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఆలస్యం చేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా కమిటీ సభ్యులు రాములు టీచర్స్ అండ్ వెల్ఫేర్ జిల్లా కోశాధికారి పండగ వెంకటరమణ, పాల్వంచ ప్రాజెక్ట్ నాయకురాలు రాజ్యలక్ష్మి, రమ్య, భాను లక్ష్మి, రేష్మ, రామలక్ష్మి, భవాని, విజయ కుమారి, వెంకటరమణ, పాల్గొన్నారు.