Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
భద్రాచలం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా కోట దేవదానం సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం కోర్టు ప్రాంగణంలో సీనియర్ న్యాయవాది నండూరి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా భద్రాచలం జేఎఫ్సిఎం మేజిస్ట్రేట్ ఎం.నీలిమ హాజరయ్యారు. ఈ సందర్భంగా బార్ ప్రెసిడెంట్ కోట దేవదానం మాట్లాడుతూ న్యాయ పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా భద్రాచలం పట్టణంలో అడిషనల్ సెషన్స్ కోర్టు క్యాంపు కోర్ట్‌గా నిర్వహించడంలో చట్ట పరమైన అవాంతరాలు లేవని, కరకగూడెం, ఏడుల్లబయ్యారం, మణుగూరు, అశ్వాపురం, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల పోలీసు స్టేషన్ పరిధిలోని సెషన్స్ కేసులను విచారించుటకు సెషన్స్ డివిజన్ నోటిఫై చేసి భద్రాచలం లో సెషన్స్ కోర్టు ఏర్పాటు చేయాలని అందుకోసమే కృషి చేయాలని, న్యాయవాదులు అందరూ ఉమ్మడిగా పోరాటం చేయాలని కోరారు. నూతన కమిటీకి మేజిస్ట్రేట్ చేతుల మీదుగా ప్రమాణ పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారి అంబెడ్కర్, బార్ మాజీ అధ్యక్షుడు జయరాజ్ సీనియర్ న్యాయవాదులు కొడాలి శ్రీనివాసన్, శ్రీనివాస చారి, గణపతి, సున్నం రమేష్, చీమల నరసింహారావు, న్యాయవాదులు, కోర్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.