Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 5న ఢిల్లీలో జరిగే ధర్నాకు ప్రజలందరూ ఏకం కావాలి
నవతెలంగాణ-బూర్గంపాడు
ప్రధాని మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, ఈనె ల 5న ఢిల్లీలో జరిగే ధర్నాకు, లౌకిక పార్టీలు , ప్రజలందరూ ఏకం కావాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మండలంలోని సోంపల్లి గ్రామంలో ఉపాధి కార్మికుల పని ప్రాంతాన్ని సందర్శించారు. కేంద్రంలో ఉన్న బిజెపి సర్కార్ దేశంలో ఉన్న సంపద అదాని, అంబానీలకు పూర్తిగా కారు చౌకగా అమ్మేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనిని కుట్రపూరితంగా ఉపాధి పనిని తొలగించాలని ప్రయత్నం చేస్తుందని ఆయన అన్నారు. రూ.62 వేల కోట్లు బడ్జెట్లో కేటాయించి పని భారాన్ని పెంచుతూ ఉదయం పూట ఒక ఫోటో, మధ్యాహ్నం మరొక ఫోటో ఆన్లైన్లో పంపించాలని ఉపాధి కార్మికుల్ని ఇబ్బం దులకు మోడీ ప్రభుత్వం గురి చేస్తుందని ఆయన విమర్శించారు. అందుకోసం దేశవ్యాప్తంగా ఈనెల 5న లక్షలాదిమందితో జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా జరగబోతుందని ఆయన అన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం గద్దె దిగిపోవాలని, కార్మిక హక్కుల్ని కాపాడుకోవాలని రైతాంగం పండించిన పంటకి గిట్టుబాటు రేటు సాధించు కోవాలని ఆయన అన్నారు. కార్మికులకు కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ బర్ల తిరపతయ్య, నిమ్మల అప్పారావు, ధనుగోరు నాగేశ్వరావు, వెంకట్ రామారావు,బత్తుల దుర్గ, రవణమ్మ, రాణి తదితరులు పాల్గొన్నారు.