Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల
నవతెలంగాణ-పాల్వంచ
అకాల వర్షాల వలన మండలంలోని పలు గ్రామాల్లో రైతుల పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే గ్రామాల్లో పర్యటించి, పాడైన పంటలను సర్వే జరిపి ప్రభుత్వానికి నివేదిక పంపాలని డిస్ట్రిక్ కోపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ వైస్ చైర్మన్, పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. మండలం పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆదివారం కొత్వాలతో పాటు ప్రజా ప్రతినిధులు, రైతులు, పర్యటించి వర్షాల వలన దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నాగారం, సంగెం, నారాయణరావుపేట, తదితర ప్రాంతాల్లో రైతులతో కలిసి పాడైన మిర్చి, వరి పంటలను చూశారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులతో కొత్వాల మాట్లాడుతూ నక్కపై తాటిపండు పడిన చందంగా''రైతుల పరిస్థితి తయారైందని, అసలే అప్పుల బాధతో ఇబ్బందులు పడుతున్న రైతుకు అకాల వర్షం శాపంలా మారిందని అన్నారు. పాల్వంచ మండలంలో మిర్చితోటలు పూర్తిగా కిందికి పడిపోయాయని, వరికి తెల్లటి తాలు కంకులు వస్తున్నాయని, మామిడితోటలు పూర్తిగా కాయలు రాలిపోయాయన్నారు. అధికారులు తక్షణమే పంట నష్టాన్ని అంచనా వేసి, ప్రభుత్వానికి నివేదికలు పంపాలన్నారు. అకాల వర్షం వలన నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో పెద్దమ్మతల్లి దేవాలయం డైరెక్టర్ ఆచార్యులు, సొసైటీ డైరెక్టర్ చౌగాని పాపారావు, రైతులు అప్పోజు సత్యనారాయణ, దంతెలబోర రాజు, ఆవుల రామారావు, భగవాన్, భోజ్యతండా శ్రీను, ఆవుల వెంకన్న, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.