Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో విడత గొర్రెల పంపిణీకి సిద్ధం చేయాలి
- పంట నష్టపోయిన రైతులను పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలి
- దళిత బంధు యూనిట్ పట్ల పర్యవేక్షణ చేయాలి
- అన్ని శాఖల సమీక్ష సమావేశాల్లో కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-పాల్వంచ
ఆరోగ్య మహిళా కేంద్రాల్లో పెద్ద ఎత్తున వైద్య పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆరోగ్య మహిళ కేంద్రంలో వైద్య పరీక్షలు నిర్వహణ పెండింగ్ సోషల్ ఆడిట్ పేరాలు రెండవ విడత గొర్రెల పంపిణీ పంట నష్టం గణన దళిత బంధు యూనిట్లు నిర్వహణ మన ఇసుక వాహనం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య మహిళా కేంద్రాల్లో మహిళలకు ఆరోగ్య పరీక్షలు మహిళా స్వయం సహాయక సంఘాలు మహిళలను పెద్ద ఎత్తున మొగులైజ్ చేయాలని చెప్పారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో ఎర్రగుంట, పర్ణశాల, పెనగడప, ఎంపీ బంజర, కొమరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మహిళలు ఆరోగ్య పరీక్షలు నిర్వహణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఉపాధి హామీ పథకంలో పెండింగ్‌లో ఉన్న ఆడిట్ పేరాలను పరిష్కారానికి చర్యలు చేపట్టారని డిఆర్డిఓకు సూచించారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాలకి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 11060 మంది గొర్రెల అయినట్లు పంపిణీకి నమోదు కాగా మొదటి విడతలో 751 మందికి యూనిట్లు పంపిణీ చేశామని రెండో విడత 349 పంపిణీకి చర్యలు చేపట్టాలని చెప్పారు. అకాల వర్షం వల్ల దెబ్బతిన్న పంటలకు పరిహారం అందించేందుకు జరుగుతున్న ప్రక్రియను పర్యవేక్షణ చేయాలని వ్యవసాయ ఉద్యాన అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు 33శాతం నష్టం వాటిల్లిన వాటికి పరిహారం అందించిన విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దళిత బంధు యూనిట్లు నిర్వాహనకు నిరంతర పర్యవేక్షణ చేయాలని మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీవోలను ఎంపీఓలను సూచించారు. యూనిట్లు ఏర్పాట్లు యాప్ లో అప్లోడ్ చేయాలని చెప్పారు.
పోషణ్ పక్వాడా విజయవంతం అవడం పట్ల: మహిళ శిశు సంక్షేమ శాఖను అభినందించిన కలెక్టర్
పోషణ లోపల నివారణకు చేపట్టిన పోషణ్ పక్వాడా కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించడం పట్ల జిల్లా కలెక్టర్ అనుదీప్ మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బందిని అభినందించారు. సోమవారం పోషణ్ పక్వాడా ముగింపు కార్యక్రమాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఫుడ్ ఫెస్టివల్‌ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గత నెల 20వ తేదీ నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు జిల్లాలో 2060 అంగన్వాడీ కేంద్రాల్లో పోషన్ అభయాన్ కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. కిశోర బాలికలకు చిరుధాన్యాలు ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారని చెప్పారు. పోషన్ పక్వాడ కార్యక్రమాలను ప్రతిరోజు ఆన్లైన్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీల ఆరోగ్య పరిరక్షణకు పోషక లోపాన్ని అధిగమించేందుకు చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడంపై అవగాహన కల్పించడం జరిగిందని చెప్పారు. పోషణ్ పక్వాడా కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రంలో ఆరోగ్యవంతమైన చిన్నారులు ఎంపిక కార్యక్రమం నిర్వహించారని ఎంపిక చేసిన చిన్నారులకు బహుమతులు ప్రశంస పత్రాలను అందజేశారు. కొత్తగూడెం అర్బన్ ప్రాజెక్టు పరిధిలోని సుజాతనగర్ మండలం నరసింహసాగర్ ప్రాజెక్టు వన్‌కి వెళ్తున్న మూడు సంవత్సరాల వయసున్న చిన్నారి ఉజ్వల శ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, జిల్లా పేరు, దేశ రాజధాని తదితర పేర్లను ముక్తకంఠంతో చెప్పడం వల్ల చిన్నారిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ ప్రాజెక్టు అంగన్వాడి టీచర్ నరసమ్మను అభినందించారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ అధికారి లేనిన సిడిపిఓలు తదితరులు పాల్గొన్నారు.