Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గద్దల రమేష్
పాల్వంచ : జనరిక్ మందులపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పించాలని అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత సర్పంచ్ గద్దల రమేష్ అన్నారు. సోమవారం డ్రగ్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్ని కలెక్టరేట్ కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాన్యులకు తక్కువ ధరలకే వివిధ మందులను అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జనరిక్ మందుల దుకాణాలను నెలకొల్పిందని అన్నారు. జనరిక్ మందుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు జనరిక్ మందులపై అవగాహన కల్పించడంలో విప్లమైందని అన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సామాన్య ప్రజలకు జనరిక్ మందులపై అవగాహన కల్పించాలని కోరినారు.