Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
పేదవాడు, ధనికుడు అనే తారతమ్యం లేకుండా ఆకలికి అర్థం చెప్పేదే రంజాన్ మాసమని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా బీఎస్పీ ఆద్వర్యంలో బస్టాండ్ వద్ద ఉన్న రైల్వే మస్జిద్-ఏ-బైతునూర్ మసీదులో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిధిగా కామేష్ హాజరై మాట్లాడారు. రంజాన్ మాసంలో కఠిన ఉపవాస దీక్షలు చేసే ప్రతి ఒక్క ముస్లిం సోదర సోదరీమణులకు పేదవాడి ఆకలి బాధలు ఏంటో తెలియాలని ఎన్నో ఏళ్ల సంవత్సరాల క్రితమే పవిత్ర ఖురాన్లో చెప్పబడిందన్నారు. రంజాన్ మాసంలోనే ఖురాన్ అవతరించిందని, ఈ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ మాసంలో ఇఫ్తార్ విందులు మత సామరస్యరానికి సోదర భావానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు. రోజా అంటే పేదవాడి ఆకలి తెలుసుకోవడమేనని తెలిపారు. ఇందులో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున రావు, మస్జిద్ సభ్యులు యండి.అమీర్ ఖాద్రీ, ఎస్.కే ఖాజాబాబా, యండి. యాసీన్, కరీమ్, ఉపాద్యాయుడు ఎస్కె. దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.