Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- టేకులపల్లి
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని బిఆర్ఎస్ టేకులపల్లి మండల నాయకులకు ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ నాయక్ సూచించారు. సోమవారం రామచంద్ర పేట గ్రామపంచాయతీలో ఎన్ఆర్ఇజిఎస్ నిధులు ద్వారా 63 లక్షల రూపాయలతో పూర్తి అయిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించారు. అభివృద్ధి కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.