Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీటీపీఎస్ లో భద్రతా అవగాహన కార్యక్రమం
నవతెలంగాణ-మణుగూరు
ప్రతి కార్మికుడికి భద్రత కల్పించాల్సిన బాధ్యత బీటీపీఎస్ యాజమాన్యంపై ఉందని బీటీపీఎస్ సీఈ బిచ్చన్న అన్నారు. సోమవారం భద్రాద్రి పవర్ ప్లాంట్ స్టేజ్-1 యూసీబీ, టీజీ స్టోర్ వద్ద ఉద్యోగుల ప్రయోజనం కోసం బీటీపీఎస్ భద్రతా విభాగం, అగ్నిమాపక భద్రత అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అగ్నిమాపక సిబ్బంది వివిధ రకాల మంటల కోసం అగ్నిమాపక పరికరాలను ఎలా ఉపయోగించాలో ప్రదర్శన నిర్వహించి వాటిపై అవగాహన కల్పించారు. అనంతరం ఇన్చార్జ్ రెస్క్యూ ఆపరేషన్స్ కొత్తగూడెం బృందంతో అత్యవసర సమయంలో ప్రత్యేక దృష్టితో పాటు కార్మికుడు ఆపదలో ఉంటే సీపీఆర్ ఎలా చేయాలో సీఈ స్వయంగా చేసి కార్మికులకు భద్రత పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈటీ శ్రీనివాసరావు, ఎస్ఈ రమేష్ బాబు, డీఈ సేఫ్టీ ఆనందప్రసాద్, డీఈ శ్రీధర్, సింగరేణి కాలరీస్ రెస్క్యూ టీమ్ ఇన్చార్జి అనంతరాములు, బృందం సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.