Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
నవతెలంగాణ-పాల్వంచ
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య చూపిన స్ఫూర్తి నేటి తరాలకు ఆదర్శమని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సోమవారం ఐడిఓసి కార్యాలయవు సమావేశపు హాలులో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దొడ్డి కొమురయ్య జయంతి వేడుకల్లో దొడ్డి కొమురయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తలచుకోగానే మొదటగా గుర్తుకు వచ్చేది పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య అని చెప్పారు. దొడ్డి కొమురయ్య సాయుధ పోరాటంలో చూపిన స్ఫూర్తిని కలెక్టర్ కొనియాడారు. తెలంగాణ ప్రజల కొరకు మహనీయుల చేసిన త్యాగాలు నేటి తరానికి తెలియచేసేందుకు ప్రభుత్వం ఆయన జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దొడ్డి కొమురయ్య స్ఫూర్తి ప్రతి ఒక్కరికి తెలియాలని, మహనీయుల వర్ధంతి, జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వారి స్పూర్తిని మనమంతా కొనసాగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి సురేందర్, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.