Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ భూముల్లో గుడిసెలు
- ప్రభుత్వ భూములన్నీ పేదలకు పెంచాలి
- సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కాసాని ఐలయ్య,రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్
నవతెలంగాణ-పాల్వంచ
ప్రభుత్వ భూములన్నీ ఇల్లు ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు పంచాలని సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కాసాని ఐలయ్య డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ ఆధ్వర్యంలో వందలాది మంది నిరుపేదలు ఏపీ స్టీల్ ఎదురుగా ఉన్న ప్రభుత్వంలో నిరుపేదలు ఆక్రమించుకుని గుడిసెలు వేశారు. అనంతరం పార్టీ పట్టణ కమిటీ సభ్యులు నిరంజన్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. పాల్వంచ పట్టణంలో ఇండిస్టియల్ ఏరియా లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇళ్లు, ఇళ్ళ స్థలాలు లేని పేదలంతా ఐక్యంగా ఉద్యమిస్తున్నారని, ఇళ్ళ స్థలాలు సాధించే వరకు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. గత ఐదు సంవత్సరాలుగా ఇళ్ల స్థలాలు కావాలని, డబుల్ బెడ్ రూంలు కేటాయించాలని వందల సార్లు వినతి పత్రాలు అధికారులకు ఇచ్చినా, ఏ మాత్రం పట్టించుకోలేదని, అనివార్యంగా ఇళ్ల స్థలాలు ఆక్రమణ చేశామని, దీనిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ప్రభుత్వం ఇండ్ల స్థలాలను వెంటనే ఇవ్వాలని కాసాని ఐలయ్య డిమాండ్ చేశారు. వందల, వేల ఎకరాల ప్రభుత్వ భూములను కొద్ది మంది భు బకాసురాలు ఆక్రమించుకున్నారన్నారు. వీరి ఆక్రమణలో ఉన్న భూములన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎజె.రమేష్ మాట్లాడుతూ ఇండిస్టీ పేరుతో భూములు తీసుకుని, పరిశ్రమ పెట్టకుండా, సబ్ లీజులకి ఇచ్చి పంటలు పండిస్తున్నారని అన్నారు. ఇటువంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నింటినీ బహిరంగంగా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. పట్టణంలో సుమారుగా 4000 మంది స్థలాలు ఇల్లు ఇండ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే అధికారుల స్పందించి ప్రభుత్వ భూములన్ని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. ఈ సభ లో పార్టీ పట్టణ కార్యదర్శి దొడ్డ రవి కుమార్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల క్రితం నవభారత్ వెనక భాగంలో ప్రభుత్వ స్థలం ఆక్రమిస్తే, అప్పటి అధికారులు వచ్చి డబుల్ బెడ్ రూంలు కట్టించి, అర్హులైన పేదలకు ఇస్తామని చెప్పిన హామీ నేటి వరకు అమలు చేయకపోగా మొండి గోడలకు లాటరీలు తీసి, లబ్దిదారులను ఎంపిక చేశారన్నారు. ఈ ఎంపిక కూడా అసంబద్ధంగా జరిగిందని, పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కమిటీ సభ్యులు సత్య వాణిరహీం క్రాంతి మాధవి తదితరులు పాల్గొన్నారు.