Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఎర్రుపాలెం
చిరు ధాన్యాలతో చిన్నారులకు మంచి పోషణ కృత్రిమంగా అందుతుందని మధిర ఐసిడిఎస్ సిడిపిఓ శారద శాంతి సూచించారు. మండల కేంద్రమైన ఎర్రుపాలెం రైతు వేదికలో సోమవారం ఐసిడిఎస్ వారి ఆధ్వర్యంలో పోషణ పక్షోత్సవాలు ముగింపు సమావేశంలో చిరు ధాన్యాలపై ప్రజా ప్రతినిధులు, అధికారులు చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పిటిసి శీలం కవిత మాట్లాడుతూ అంగన్వాడి టీచర్లు చిన్నారుల భవిష్యత్తు కోసం ఎనలేని కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్య క్రమంలో మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్, ఏపీఎం వెంకటేశ్వర్లు, సర్పంచ్ మొగిలి అప్పారావు, ఎంపీటీసీ మస్తాన్వలి, ఏసీడీపీఓ కృష్ణ శ్రీ, సూపర్వైజర్ రమణ, శశి షర్మిల దేవి, బనిగండ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేం ద్రం వైద్యాధికారి వీరబాబు, అంగన్వాడి టీచర్లు, ఆశా కార్య కర్తలు, గ్రామ దీపికలు, తదితరులు పాల్గొన్నారు.
సత్తుపల్లి : చిరు ధాన్యాలతో తయారుచేసిన ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యకరమని సత్తుపల్లి సీడీపీవో కొండమ్మ అన్నారు. సోమవారం స్థానిక స్త్రీశక్తి భవన్లో పోషణ పక్వాడ్ కార్యక్రమాల సందర్భంగా అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఐసీడీఎస్, సెర్ప్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కొండమ్మ మాట్లాడారు. సమావేశంలో ఎంపీవో కృష్ణ, ఏపీఎం కేవీ సుబ్బారావు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు యూ.మహాలక్ష్మీ, రమాదేవి, రజని, సీసీలు రామారావు, శ్రీనివాస్, కృష్ణ, నరేందర్ పాల్గొన్నారు. సమావేశానికి ముందు పోషన్ పక్వాడ్ ర్యాలీని నిర్వహించారు.