Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీఎంకు వినతి పత్రం అందజేత
నవతెలంగాణ-బూర్గంపాడు
దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఐకేప, వీఓఏల సమస్యలు పరిష్కరించాలని, ఈ నెల నుండి 16 వరకు ఆన్లైన్ పసులు బంద్ చేస్తామని, ఈనెల 17 నుండి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తామని మండల ఐకెపి విఓఏల సంఘం అధ్యక్షురాలు ఎన్.సాయి లక్ష్మి, కార్యదర్శి కమల్ భీ, కోశాధికారి తోకల పోషమ్మలు పేర్కొన్నారు. మంగళవారం బూర్గంపాడులోని ఐకెపి కార్యాలయంలో ఐకెపి విఓఏల సమస్యల పరిష్కరించాలని కోరుతూ ఏపీఎంకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ గ్రామ స్థాయిలో 17,606 మంది విఓఏలు గ్రామ సంఘాల సహాయకులు పని చేస్తున్నామని, 19 సంవత్సరాల నుండి గ్రామాలలో మహిళల అభ్యున్నతికి మహిళ స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేస్తూ మహిళలు ఆర్థికంగా, సామా జికంగా ఎదగడానికి వారికి అవగాహన కల్పిస్తున్నామని వారు పేర్కొన్నారు. చిన్న, చిన్ని వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహించి వారికి లోన్స్ ఇప్పించి తిరిగి సక్రమంగా లోన్స్ చెల్లించే విధంగా ప్రోత్సహిస్తున్నామని, ద్వారా మహిళా సంఘాలు నిర్వహిస్తున్న లావాదేవీలన్నీ పుస్తక నిర్వహణ చేస్తూ ఎస్.హెర్క్ లైవ్ మీటింగ్ పెట్టి అన్ని సంఘాలు ఆన్లైన్లో ఏంట్రీ చేస్తున్నామని వారు తెలిపారు. మహిళా సంఘాల పనులే కాకుండా ప్రభుత్వం చేపడుతున్న అన్నిరకాల సంక్షేమ పథకాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని, తెలంగాణ రాష్ట్రం వచ్చి ఎనిమిదేండ్లు దాటినా విఓఏల బతుకులు ఏమీ మారలేదని వారు పేర్కొన్నారు. విఓఏలకు సెర్చ్ నుండి కేవలం రూ.3,900లు గౌరవ వేతనం మాత్రమే చెల్లిస్తున్నారని, విఓఏలకు కొత్త కొత్త సర్వేలు, చేపిస్తూ పని భారం పెంచుతున్నారని వారు విమర్శించారు. ఐకెపి విఓఏలను సెర్చ్ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు అన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, రూ.10 లక్షల సాధారణ బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని వారు పేర్కొన్నారు.
సెర్ఫ్ నుండి ఐడీ కార్డులు ఇవ్వాలని, గ్రామ సంఘం గ్రేడింగ్‌తో సంబంధం లేకుండా ప్రతినెలా వేతనాలు విఓఏల వ్యక్తిగత ఖాతాలకు చెల్లించాలని, జాబ్ చార్జ్‌తో సంబంధం లేని ఆన్లైన్ పనులతో సహా ఇతర పనులు చేయించరాదని వారు అన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఐకెపి విఓఏల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐకెపి విఓఏ ఉద్యోగుల సంఘం నాయకురాళ్ళు పాల్గొన్నారు.