Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్‌కు విన్నవించిన గుమ్మడి
- స్పందించిన కలెక్టర్, అధికారులకు ఆదేశాలు
నవతెలంగాణ-ఇల్లందు
కొమరారం గ్రామపంచాయతీ పరిధిలో గత నెలలో పడ్డ అకాల వడగండ్ల వర్షాలతో నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు కలెక్టర్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య పలు రకాల ప్రజా సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. పరిశీలించిన కలెక్టర్ కొమరారంలో అసంపూర్తిగా ఉన్న సైడ్ డ్రైన్ పనులను ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొమరారం గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటుకు వెంటనే జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణంకు సిఎస్ఆర్ నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నైట్ వాచ్మెన్ నియమిం చాలని కోరగా సానుకూలంగా స్పందించారు. మిషన్ భగీరథ నీరు ప్రతి ఇంటికి సరఫరా అయ్యే విధంగా చూడాలని సంబంధిత ఏఈని ఆదేశించారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. మామిడి తోటలు, టమాటా ఇంకా ఆర్టికల్చర్‌కు సంబంధించిన నష్టాన్ని కూడా సర్వే చేయాలని సంబంధిత జిల్లా అధికారి మరియన్నను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా, ఏఐపీకేఎస్ నాయకులు బుర్ర వెంకన్న, మండల కార్యదర్శి పూణేంకుమార్, సర్పంచ్ కృష్ణవేణి, వార్డు మెంబర్స్ శంకర్, శాంతారావు పాల్గొన్నారు.