Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాసంఘాల జిల్లా స్థాయి సమావేశంలో సాబీర్ పాషా
నవతెలంగాణ-పాల్వంచ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక చండ్ర రాజేశ్వరరావు భవన్లో రేసు ఎల్లయ్య అధ్యక్షతన ప్రజా సంఘాల జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సాబీర్ పాషా మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన తర్వాత రోజు రోజుకు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి తమ పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకొని పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థతోపాటు ఫెడరిలిజాన్ని పూర్తిగా నాశనం చేయడానికి పూనుకుందని విమర్శించారు. జిల్లాలో నిర్మిస్తున్న సీతారామా ప్రాజెక్టుకు సంబందించి ఆయకట్టు పెంచి జిల్లా రైతాంగానికి మేలు చేయాలని, ప్రగళ్ళపల్లి, రోళ్ళపాడు, పులుసుబొంత ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ హటావో దేశ్‌కు బచావో నినాదంతో, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 14 నుంచి జిల్లాలో జరగనున్న సీపీఐ ప్రజా పోరు యాత్రలోలి ప్రజాసంఘాల నాయకులు ప్రముఖ పాత్ర పోషించి యాత్ర జయప్రదానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, బందెల నరసయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు ఏపూరి బ్రహ్మం మున్నా లక్ష్మి కుమారి, శ్రీనివాస్ ప్రజా సంఘాల జిల్లా నాయకులు జమలయ్య, పూర్ణచంద్రరావు, కొండలరావు, ఎండి.యూసుఫ్, వి.పద్మజ, కే.రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.