Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖమ్మం జిల్లా నుంచి వందలాదిగా తరలిన రైతులు, కార్మికులు
నవతెలంగాణ-ఖమ్మం
వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం నిర్ణయం చేసి చట్టబద్ధత కల్పించాలని, దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ అమలు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లు పార్లమెంట్ నుంచి ఉపసంహరించుకోవడం, ఉపాధి హామీ చట్టానికి కేంద్ర బడ్జెట్లో నిధులు కోత, ఆహార భద్రత పథకాలకు అవసరమైన నిధులు కేటాయింపు, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం, లేబర్ కోడ్లు రద్దు డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 5న ఢిల్లీలో జరిగే కార్మిక, కర్షక సంఘర్ష్ మహా ప్రదర్శనకు ఖమ్మం జిల్లా నుంచి వందలాది మంది మంగళవారం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా కార్మిక, కర్షక మహా ప్రదర్శన జరుగుతుందని, వ్యవసాయ రంగం కార్పొరేట్ కంపెనీలు పరం కాకుండా అడ్డుకునేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతులు శ్రామిక ప్రజల గళం ఢిల్లీ లో వినిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మేరుగు సత్యనారాయణ, సిఐటియు జిల్లా నాయకులు వై.విక్రం, యర్రా శ్రీనివాసరావు, రాయల వెంకటేశ్వరరావు, ఎస్కె మీరా, విఠల్, చెరకుమల్లి కుటుంబరావు, ఉమ, కందుల భాస్కరరావు, సంక్రాంతి నర్సయ్య వందలాది మంది రైతులు కార్మికులు పాల్గొన్నారు.