Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - బోనకల్
అకాల వర్షం వల్ల దెబ్బతిన్న ప్రతి రైతుకి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని, ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణఅధికారి వివి అప్పారావు అన్నారు. మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామంలో మంగళవారం పంటనష్ట పరిహారం కోసం నమోదు చేసిన పంటపొలాలను సిఈఓ అప్పారావు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షం వలన దెబ్బతిన్న ప్రతి రైతుకి ప్రభుత్వం నుంచి పరిహారం అందే విధంగా పంట నమోదు చేస్తున్నట్లు తెలిపారు. పంట నష్టపోయిన రైతులందరూ తప్పనిసరిగా సర్వే అధికారులతో నమోదు చేయించుకోవాలని కోరారు. పంట నష్టంపై సమగ్ర సర్వే నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. వ్యవసాయ శాఖ సిబ్బంది పంట నష్టం నమోదు చేసిన పంట పొలాలను పరిశీలించడానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. బోనకల్ మండల వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్నదాతలు నష్టపోయినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో బోడేపూడి వేణుమాధవ్, ఎంపిఓ వ్యాకరణం వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, సర్పంచ్ మర్రి తిరుపతిరావు, మాజీ సర్పంచ్ పారా లక్ష్మినారాయణ, గ్రామ పంచాయతీ కార్యదర్శి జొన్నలగడ్డ పరశురాం, రైతులు షేక్ జాని, షేక్ ఉద్దడ్డు సాహెబ్, అనుబోతు శ్రీను తదితరులు పాల్గొన్నారు.