Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యేర్రా కామేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రశ్నా పత్రాల లీకేజీ పర్వం కొనసాగుతుందని మొన్న టీఎస్పీఎస్పి, ప్రస్తుతం10వ తరగతి పరీక్షా ప్రశ్నాపత్రాలు ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యేర్రా కామేష్ మండిపడ్డారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ మౌనముద్ర విడాలని చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన పోస్టల్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 30 లక్షల మంది నిరుద్యోగ యువతీ, యువకులకు జరిగిన అన్యాయం గురించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఖచ్చితంగా ఒక ప్రకటన విడుదల చేయాలని లేని పక్షంలో ప్రశ్నాపత్రాల లీకేజీలో కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందని భావించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సాయి, నాగుల రవి కుమార్, బానోత్ పవన్ కళ్యాణ్, తాటిపాముల హరికృష్ణ, షేక్ ఇర్ఫాన్, బుర్రి రవిచంద్ర, సంషేర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.