Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అనుదీప్ ఆర్డిఓ కార్యాలయ ప్రాంగణంలోని ఈవియం, వివిప్యాట్ గోదాంను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి రాజకీయపార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవియం, వివిప్యాట్ గోదాం తనిఖీ చేయడం జరుగుతుందని చెప్పారు. గోదాంలో ఉన్న అగ్నిమాపక నియంత్రికలను, సీసీ కెమేరాలను ఈవియం, వివిప్యాట్లను ఆయన పరిశీలించారు. తనిఖీ అనంతరం ఈవియం, వీవిఫ్యాట్ తనిఖీ రిజిష్టరులో సంతకం చేశారు. తనిఖీ నివేదికలను ఎన్నికల సంఘ కార్యాలయానికి పంపనున్నట్లు ఆయన వివరించారు. తనిఖీ అనంతరం గోదాంకు రాజకీయ నాయకుల ప్రతినిధుల సమక్షంలో సీల్ వేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సురేష్, సిబ్బంది నవీన్, బిఆర్ఎస్ నుండి సత్యనారాయణ, కాంగ్రెస్ నుండి సంతోష్ కుమార్, బీజేపీ నుండి లక్ష్మణ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.