Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐలూ జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్ మక్కడ్
- కార్మికోద్యమ నిర్మాత బీటి రణదివే స్ఫూర్తితో జమిలి ఉద్యమాలు నిర్మించాలి-ఎంఎన్. రెడ్డి
- సీఐటీయూ సీనియర్ నేత పిలుపు
- సామాజిక వివక్షత పై ఐక్యంగా ఉద్యమించాలి
- సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే.రమేష్.
- సీఐటీయూ ఆధ్వర్యంలో ఘనంగా బీటీ రణదీవే 33వ వర్ధంతి
నవతెలంగాణ-కొత్తగూడెం
మతోన్మాద విధానాలు అవలంబుస్తున్న, కార్మిక వ్యతిరేక అయిన, బిజెపి, ఆర్ఎస్ఎస్ విధానాలపై త్రిబుల్ ఇంజన్ (కార్మికులు- రైతులు- వ్యవసాయ కూలీలు)తో మోడీ గద్దె దిగే వరకు ఐక్య ఉద్యమాలు నిర్మించాలని ఐలూ జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్ మక్కడ్ అన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక టీచర్స్ భవన్లో భూక్య రమేష్ అధ్యక్షతన అమరజీవి బీటీ రణధీవే 33వ వర్ధంతి సందర్భంగా సదస్సును నిర్వహించారు. ముందుగా బిటి రనదీవే చిత్రపటానికి ఎంఎన్. రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో ముఖ్యఅతిథిగా రమేష్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమస్ఫూర్తితో కార్మిక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి, సంఘాలు పెట్టి, హక్కులు సాధించుకున్న మహనీయుల చరిత్రను కాలరాస్తూ. కార్మిక హక్కులుపై దాడిచేస్తూ, కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా చేసి కార్మిక వర్గంతో చెలగాటమాడుతున్న కేంద్ర బిజెపి ప్రభుత్వంపై కార్మికులు, రైతుల, వ్యవసాయ కార్మికులు కలిసి త్రిపుల్ ఇంజన్‌తో పోరాటం చేసి దేశాన్ని రక్షించాలన్నారు. సమూల మార్పులు తీసుకురావాలని ఆయన అన్నారు.
సిఐటియు సీనియర్ నేత ఎం.ఎన్.రెడ్డి మాట్లాడుతూ మతోన్మాద వైఖరి తోటి కార్మిక వర్గంలో చిచ్చు పెడుతూ పోరాటాలను విచ్చిన్నం చేసే దిశగా కార్మిక హక్కుల్ని కాలరాస్తున్న బిజెపి ప్రభుత్వంపై తిరగబడాలని ప్రజల్ని, కార్మికులను చైతన్యం చేయాలన్నారు.
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజె. రమేష్ మాట్లాడుతూ కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు జమిలి ఉద్యమాలు నిర్మించాలని ఆయన పిలుపు నిచ్చారు. దేశ వ్యాప్తంగా కార్మిక వర్గం, కర్షకులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని 9 ఏళ్ల బిజెపి పాలనలో ధరలు పెరగడం, నిరుద్యోగం, 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి కార్మిక వర్గాన్ని విచ్చినం చేయాలని చూస్తున్నారని, ప్రభుత్వ సంస్థల అమ్మకం, కార్పొరేట్లకు ఊడిగం చేసేవాళ్ళపై వ్యతిరేకంగా త్రిబుల్ ఇంజన్‌తో ఐక్య ఉద్యమాలు నిర్మించి బిజెపి, ఆర్ఎస్ఎస్ విధానాలపై ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కె.సత్య, కమిటీ సభ్యులు భూక్య రమేష్, రాములు, సదానందం, నాయకులు గాజుల రాజారావు, సమ్మయ్య, మాధవి, రమణ, కళావతి, శైలజ, రేష్మా, సామ్యులు, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.