Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో విడత గొర్రెల పంపిణీకి 3627 మంది లబ్ధిదారులు
- మూలధన వాటా చెల్లింపునకు చర్యలు చేపట్టాలి
- జిల్లా కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-పాల్వంచ
హైదరాబాద్ లో ఈనెల 14వ తేదీన డాక్టర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు జిల్లా నుంచి వెళ్లే వారికి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం మినీ సమావేశం హాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ గొర్రెలు పంపిణీకి లబ్ధిదారులు ఎంపికపై పంచాయతీరాజ్ ఎస్సీ అభివృద్ధి శాఖ రవాణా ఆర్టీసీ మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 10.25 అడుగుల విగ్రహం ప్రారంభోత్సవానికి నియోజకవర్గం నుండి 300 మందిని హైదరాబాద్ పంపనున్నట్లు చెప్పారు. వారిని ఎంపిక చేయాల్సిన బాధ్యతను జడ్పీ సీఈఓ డిపిఓ లు పర్యవేక్షణ చేయాలని చెప్పారు అశ్వరావుపేట, పినపాక, భద్రాచలం నియోజకవర్గం నుండి వెళ్ళుటకు మండల కేంద్రాలకు బస్సులు పంపు విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశి ంచారు. 14వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు నూతన సెక్రటేరియట్ కు చేరుకునే విధంగా వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. వెళ్ళుచున్న వారికి అల్పాహారం మధ్యాహ్నం రాత్రి భోజనాలు ఏర్పాటుకు ఇద్దరు జిల్లా అధికారులను ఇద్దరు తహసిల్దారులను కేటాయించినట్లు చెప్పారు.
జిల్లాల్లో రెండో విడత గొర్రెలు పంపిణీకి 3627 మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు. లబ్ధిదారులు మూలధన వాళ్ళ చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయు విధంగా చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక అధికారిని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జడ్పి సీఈవో విద్యాలత, డిపిఓ రమాకాంత్, ఎస్సీ అభివృద్ధి అధికారి ఎం.రామ్మూర్తి, జయపాల్ రెడ్డి, కొత్తగూడెం, భద్రాచలం ఆర్టీసీ డీఎంలు బివి రావు, బి రామారావు, మున్సిపల్ కమిషనర్లు రఘు, శ్రీకాంత్ అంకుషవాలి, డిఆర్ఓ అశోక్ చక్రవర్తి, కొత్తగూడెం భద్రాచలం ఆర్డీవోలు రత్న కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.