Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ప్రజా పోరు యాత్ర' లకు దండుగా కదలాలి
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ-చుంచుపల్లి
ప్రజల సంక్షేమాన్ని విస్మరించి కార్పోరేట్లకు ఊడిగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి, వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టి వచ్చే ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ది చెప్పేందుకు ప్రజలను సంసిద్ధులను చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. చుంచుపల్లి మండలంలోని శ్రీరామా ఫంక్షన్ హాల్లో గురువారం జరిగిన కొత్తగూడెం పట్టణం, చుంచుపల్లి, లక్ష్మి దేవిపల్లి, సుజాతనగర్ మండలాల జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆకాశాన్నంటుతున్న ధరల భారంతో సామాన్యుడి బతుకు భారంగా మారిందని, వంట గ్యాస్, ఇంధన ధరలతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు పేదల బతుకులను చిన్నాభిన్నం చేస్తున్నాయన్నారు. ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాట ధర నోచుకోవడం లేదని, కార్మికుల హక్కులు కాలరాయ బడుతున్నాయని ఆరోపించారు. పేదలకోసం సాధించుకున్న ఉపాదిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకు పాల్పడుతున్నారన్నారని ఆరోపించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా మాట్లాడుతూ బిజెపి కో... హఠావ్.. దేశ్ కో బచావ్ నినాదంతో జిల్లాలో చేపట్టనున్న ఇంటింటికి సిపిఐ, ప్రజా పోరు యాత్రలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. తొలిదఫా యాత్రలను ఈ నెల 14 నుంచి చర్లలో ప్రారంభం అవుతాయని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బందెల నర్సయ్య, గుత్తుల సత్యనారాయణ, దుర్గరాశి వెంకటేశ్వర్లు, వై.శ్రీనివాసరెడ్డి, చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు వాసిరెడ్డి మురళి పాల్గొన్నారు.