Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీ వాహనాల రాక పోకలతో రహదారులు ధ్వంసం
- కోట్లు వెచ్చించి నిర్మించిన బీటీ రహదారికి బీటలు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
పట్టుమని పది కాలాల పాటు ఉండాల్సిన బిటి రహదారులు ఏడాది తిరగక ముందే సర్వనాశనం అవుతున్నాయి. నిర్మాణ సమయంలో నాణ్యతాలోపం ఒక కారణమైతే భారీ వాహనాల రాక పోకల సాగించడం మరో కారణం వలన కోట్ల రూపాయలతో నిర్మించిన రహదారులు పగుళ్లు పట్టి బద్దలైపోతున్నారు..ప్రభుత్వ ఆస్తులు పాడు కాకుండా కాపాడాల్సిన అధికారుల బాధ్యతారాహిత్యం మూలంగానే ఇదంతా జరుగుతుందనే చెప్పవచ్చు. మండలంలోని చిన్ననల్లబల్లి ప్రధాన రహదారి నుండి జిన్నెలగూడెం గ్రామం వరకు సుమారు 6 కిమీ మేర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాధారణ( ఎల్డబ్ల్యుఈ) నిధులతో బీటీ రహదారి( డబుల్ రోడ్డు) నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేశారు. ఈ పనులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ 26.06. 2020న ప్రారంభించారు. పనులు దక్కించుకున్న గుత్తే దారు ఈ పనులను సుమారు రెండేళ్లపాటు నిర్వహించి పూర్తి చేశాడు. కాగా రహదారి నిర్మాణ సమయంలో గుత్తే దారు నాణ్యత విస్మరించి పనులు చేపడుతున్నాడనే విమర్శలు సైతం వెల్లువెత్తాయి.
భారీ వాహన రాక పోకలు
చిన్ననల్లబల్లి, జిన్నెలగూడెం గుండా గత నాలుగు నెలలుగా భారీ వాహనాలు రాత్రి పగలు రాక పోకలు సాగిస్తున్నారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో భాగంగా గోదావరిక, చిన్నగుబ్లమంగి వాగుకు నిర్మిస్తున్న కరకట్ట నిర్మాణ పనుల కోసం ఈ ప్రాంతం నుండి భారీ వాహనాలు (టిప్పర్) తో మట్టి తోలకాలు సాగిస్తున్నారు. నిబంధనలకు మించి 40 నుండి 50 టన్నుల మేర లోడుతో మట్టి తోలకాలు సాగించడం వలన కోట్ల రూపాయలతో నిర్మించిన బిటి రహదారి పలు చోట్ల పగుళ్లతో దర్శనమిస్తుండగా గోతులమయంగా తయారైంది. నిబంధలను పూర్తిగా విస్మరించి మట్టి తోలకాలు సాగిస్తున్నప్పటికి చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు సైతం మామూళ్ల మత్తులో చూసి చూడనట్లు గా వ్యవహరిస్తున్నారనే విమర్శలు
సైతం వెళ్లువెత్తుతున్నాయి...
పైపు లైన్లు పగిలి అధ్వానంగా రహదారి : మిడియం జయమ్మ (చిన్ననల్లబల్లి జిపి సర్పంచ్)
మట్టిలోడుతో టిప్పర్లు రాత్రి పగలు రాక పోకలు సాగించడం వలన చిన్ననల్లబల్లి సెంటర్లో మిషన్ భగీరథ పైపులైన్ పగిలి రహదారి మొత్తం గోతుల మయంగా తయారైందని చిన్ననల్లబల్లి గ్రామపంచాయితీ సర్పంచ్ మిడియం జయమ్మ నవతెలంగాణకు తెలిపారు. రహదారి ప్రారంభంలో పెద్ద పెద్ద గోతులు ఏర్పడడం వలన వాహన దారులు రాక పోకలకు ఇబ్బందులు పడడంతో పాటు రాత్రి పూట ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆమె తెలిపారు. మట్టి తోలకాలు సాగిస్తున్న గుత్తేదారు రహదారికి మరమ్మతులు చేపించడంతో పాటు పగిలి పోయిన మిషన్ భగీరథ పైపు లైన్ లీకులు కాకుండా చర్యలు తీసుకోవాలని లేక పోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వాహనాలను అడ్డుకుంటామని తెలిపారు.