Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు ఇండ్లు దగ్ధం అ ఐదు లక్షల ఆస్తి నష్టం
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండలంలోని డి.కొత్తగూడెం గ్రామంలో గురువారం ప్రమాద వశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు రూ.5 లక్షల మేర అస్తి నష్టం సంభవించినట్లు రెవెన్యూ అధికారులు పంచనామా నిర్వహించారు. గ్రామానికి చెందిన కారం మంగరాజు, కారం లకీëపతి, కారం నాగమ్మ, కారం వెంకటేశ్వర్లు గురువారం ఉదయమే కూలీ పనులకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో ప్రమాద వశాత్తు ఒక్క సారిగా మంటలు వ్యాపించడంతో గమనించి స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికి మంటలు అదుపులోకి రాక పోవడంతో నాలుగు ఇళ్లు పూర్తిగా కాలి పోయాయి. ఈ ప్రమాదంలో ఇంటి సామాగ్రితో పాటు నగదు, బంగారం, వెండి బ్యాంకు పాసు పుస్తకాలు పూర్తిగా కాలి పోయాయి. ఆర్ఐ ఆదినారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని ఆస్తి నష్టాన్ని అంచనా వేశారు. నాలుగు అగ్నిబాధిత కుటుంబాలకు చెందిన సుమారు రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్సినట్లు నిర్దారించారు. కాగా నడికుడి ఎంపిటిసి సోడి తిరుపతిరావు, సర్పంచ్ తెల్లం రామకృష్ణలు సంఘటనా స్థలాన్ని పరీశీలించి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాదిదిత కుటుంబాలకు తక్షణ సహాయంగా అందించే పరిహారంతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందజేసి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విదాలా ఆదుకోవాలన్నారు.