Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
స్వాతంత్ర పోరాట వీరుడు, భారత కార్మికోద్యమ నిర్మాతల్లో ప్రముఖులు, సిఐటియు వ్యవస్ధాపక ప్రధానకార్యదర్శి బిటి రణదీవే 33వ వర్ధంతి సభలను సిఐటియు భద్రాచలం పట్ణణంలో హమాలి యూనియన్, గ్రామపంచాయితీ యూనియన్, పుట్ పాత్ అండ్ గౌతమి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఇండిస్టియల్ ఏరియా, పాత మార్కెట్, గ్రామపంచాయతీ కార్యాలయం సెంటర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కెబ్రహ్మాచారి మాట్లాడుతూ బిజెపి ఆర్ఎఎస్ఎస్ మను వాద భాజాలానికి వ్యతిరేకంగా, కేంద్ర బిజెపి ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ ల రద్దుకోసం సమరశీల పోరాటాలు చేయటమే బిటి రణదీవేకి ఇచ్చే నివాళి అన్నారు. బ్రిటిశ్ వలస వాదంపైన దేశ స్వాంత్య్రంకోసం బిటి రణదీవె పోరాటం చేశారు. కార్మిక చట్టాలను సాధించటంకోసం బ్రిటీస్ పాలకులపైన మరియు స్వాతంత్య్ర అనంతరం భారత పాలకులపైన బిటి రణదీవె పోరాటంచేశారు. మార్కెట్ సెంటర్ బిటి రణదీవె విగ్రహానికి సిఐటియు నాయకులు యంబి. నర్సారెడ్డి, హమాలి యూనియన్ టౌన్ కన్వీనర్ వెంకటరామారావు, గ్రామపంచాయితీ ఆఫీస్లో యన్ నాగరాజు, బిటి రణదీవె చిత్రపటానికిి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు మర్లపాటి రేణుక, జి.లక్ష్మికాంత్, పి.సంతోష్, సాయి, కాపుల రవి, వెంకట్రావు, నాగయ్య, బండారు రమాకృష్ణ పాల్గొన్నారు.