Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మర్యాదపూర్వకంగా కలిసిన నూతన కార్యవర్గం
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యలు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు దిశాల కృష్ణారావు, ఉపాధ్యక్షుడు మాదిరాజు, ప్రధాన కార్యదర్శి మన్నేపల్లి బసవయ్య, ట్రెజరర్ ప్రవీణ్ కుమార్, జాయింట్ సెక్రటరీ విజయ రాఘవ, స్పోర్ట్స్ సెక్రటరీ రావుల వెంకట్, మహిళా ప్రతినిధి కేవీపీ లక్ష్మి, ఈసీ మెంబర్ సింగం జనార్ధన్లను శాలువాతో సత్కరించారు. ఖమ్మం లీగల్ సెల్ అద్భుతంగా పనిచేస్తుందని, బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన ఏ ఉద్యమమైనా ముందుండి నడిపించేది లీగల్ సెల్ విభాగమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రత్యర్థులు ఎవరైనా వారి కుతంత్రాలను తిప్పికొట్టాలని, తొండి మాటలు, తొండి చేష్టలను ఎదుర్కొని వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను గెలిపించుకుని ప్రత్యర్థులకు తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. అనంతరం న్యాయవాదులు బీఆర్ఎస్ లీగల్ సెల్లో చేరారు. వారికి మంత్రి పువ్వాడ బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో దిరిశాల కృష్ణారావు, మన్నేపల్లి బసవయ్య, మేకల సుగుణా రావు, కొత్త వెంకటేశ్వరరావు, బిచ్చల తిరుమలరావు, పసుపులేటి శ్రీనివాస్, పొట్ల శ్రీకాంత్, బెల్లం ప్రతాప్, ఇర్షాద్, ఇమ్మడి లక్ష్మీనారాయణ, సింగం జనార్దన్ గౌడ్, బత్తుల బసవ పున్నయ్య తదితరులు ఉన్నారు.