Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బండి సంజయ్‌ను కఠినంగా శిక్షించాలి
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ- సత్తుపల్లి
రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే దురుద్దేశంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అడ్డంగా బుక్కయ్యాడని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపధ్యంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి లబ్ధిపొందాలని బీజేపీ నాయకులు చూస్తున్నారని ఆరోపించారు. గురువారం స్థానిక జే-కన్వెన్షన్ హాలులో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన సమావేశాల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడారు. పేపరు లీకేజీ వ్యవహారంలో అడ్డంగా దొరికిన బండి సంజరును కఠినంగా శిక్షించాలన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ ఛైర్మెన్ వనమా శ్రీనివాసుదేవరావు, మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణయ్య, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎస్కే రఫీ, కార్యదర్శి మల్లూరు అంకమరాజు, పెనుబల్లి జెడ్పీటీసీ సభ్యులు చెక్కిలాల మోహనరావు పాల్గొన్నారు.
11న సత్తుపల్లిలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం
11న సత్తుపల్లిలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. ఆత్మీయ సమ్మేళన సమావేశం విజయవంతం కోసం గులాబీ శ్రేణులతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే సండ్ర దిశానిర్దేశం చేశారు. తుమ్మూరు రామారావు వీధిలో జరిగే ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో అన్ని సామాజికవర్గాల ప్రజలతో పాటు వ్యాపార వర్గాల వారిని కూడా ఈ ఆత్మీయ సమేళన సమవేశానికి ఆహ్వానం పలకాలని పార్టీ శ్రేణులను సండ్ర కోరారు. మాటల్లో కాదని, చేతల్లో జరిగిన, జరుగుతున్న రూ. 100కోట్ల సత్తుపల్లి అభివృద్ధి భౌతికతను కరపత్రాల్లో ముద్రించి ఇంటింటికి పంచాలన్నారు. సత్తుపల్లి ఆత్మీయ సమ్మేళన సభకు జిల్లా మంత్రి పువ్వాడ అజయకుమార్, ఎంపీ నామ నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండి పార్థసారది రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు డు, ఎమ్మెల్సీ తాతా మధు పాల్గొననున్నారని సండ్ర తెలిపారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమా మహేశ్వరరావు, ఆత్మ ఛైర్మెన్ వనమా శ్రీనివాస దేవరావు, మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, పట్టణ, మండల బీఆర్ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే రఫీ, యాగంటి శ్రీనివాసరావు, అంకమరాజు, డీసీసీబీ డైరెక్టర్లు చల్లగుండ్ల కృష్ణయ్య, మోదుగు పుల్లారావు పాల్గొన్నారు.