Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్‌ను కలిసిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
గత కొన్ని సంవత్సరాలుగా పాలేరు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గురువారం జిల్లా కలెక్టర్ గౌతమ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గౌతమ్‌కు పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. పాలేరు నియోజకవర్గంలో మిస్సింగ్ పాస్ పుస్తకాల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ధరణిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. అర్హులైన పేదలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. ఖమ్మంరూరల్ మండలంలోని తెల్దారుపల్లి గ్రామంలో సర్వే నంబర్ 205లో 37 ఎకరాలు, సర్వే నంబర్ 569లో 20 ఎకరాలు మొత్తం 57 ఎకరాల ప్రభుత్వ భూమిని అటవీశాఖకు కేటాయించడం జరిగిందన్నారు. అందులో గ్రామానికి అనుకొని ఉన్న సర్వే నంబర్ 569లో ఉన్న 20 ఎకరాలను గ్రామ అవసరాల నిమిత్తం గ్రామానికే ఉంచాలని, సర్వేనెంబర్ 205లోనే 57 ఎకరాలు ఫారెస్ట్‌కు తీసుకోవాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ నివేదికను ఫారెస్ట్ ఉన్నతాధికారులకు అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సర్పంచ్ సిద్దినేని కోటయ్య, గ్రామస్తులు షేక్ రంజాన్, ఆవుల పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.