Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ అనుదీప్ హర్షం
నవతెలంగాణ-పాల్వంచ
చుంచుపల్లి మండల పరిధిలోని గౌతం పూర్ పంచాయతీకి జాతీయస్థాయిలో హెల్ది పంచాయతీ అవార్డు రావడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. 9 అంశాలలో అవార్డులు ఎంపిక ప్రక్రియ జరిగిందని, వాటిలో హెల్ది పంచాయతీ విభాగంలో గౌతంపూర్ పంచాయతీకి జాతీయ స్థాయిలో మొదటి స్థానం లభించినట్లు చెప్పారు. పంచాయతీలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలు, పచ్చదనం పెంపొందించుటకు చేపట్టిన చర్యలు, మురుగునీరు నిర్వహణ తదితర అంశాలపై చేసిన కృషికి జాతీయ స్థాయిలో లభించిన గౌరవమని ఆయన పేర్కొన్నారు. వ్యర్థాలు, వ్యాధులు నుండి స్వచ్ఛత కోసం చేసిన నిరంతర కృషి ఫలితంగా నేడు మన జిల్లాకు జాతీయ స్థాయిలో హెల్ది పంచాయతీ విభాగంలో మొదటి స్థానం వచ్చినట్లు చెప్పారు. ఇదే కృషితో మన జిల్లాను అభివృద్ధిలో రోల్ మోడల్‌గా తయారు చేయాలని చెప్పారు. ఈ అవార్డు సాధించడం మనందరి పనితనానికి లభించిన గౌరవమని ఆయన పేర్కొన్నారు. అవార్డు సాధనకు కృషి చేసిన సర్పంచ్ పోడియం సుజాతను, కార్యదర్శి జక్కంపూడి షర్మిళను, డీపీఓ రమాకాంత్‌ను, డీఆర్డీఓ మధుసూదన్ రాజును, జడ్పి సీఈఓ విద్యాలతను, ఎంపీడీఓ రమేషను, ఎంపిఓ సత్యనారాయణను జిల్లా వైద్యాధికారి డా.శిరీష, ఎఎన్ఎంలు సిహెచ్ విజయకుమారి, బి.తులసి, ఎల్. కౌసల్య, టి.కాంతామణి, ఆశా కార్యకర్తలు ఎం.సరిత, ఆర్.సరోజ, కె.నిర్మల, బి.వెంకటలక్ష్మి లను కలెక్టర్ అనుదీప్ ప్రత్యేకంగా అభినందించారు.