Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిషన్ భగీరథ ఐటీసీ అధికారులతో సమీక్ష
- విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు
నవతెలంగాణ-మణుగూరు
పారిశ్రామిక వాడలోని కాలనీలో వేసవి వస్తే తాగునీటి సమస్య ఉత్పన్నమయ్యేదని ఇక ఆ తాగునీటి కష్టాలు త్వరలో తీరనున్నట్లు ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శుక్రవారం మణుగూరులోని ఇల్లందు సింగరేణి అతిధి గృహంలో మిషన్ భగీరథ, సారపాక ఐటీసీ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ, ఐటీసీ అధికారులతో సీపీడబ్ల్యూఎఫ్ స్కీం (కమ్యూనిటీ ప్రొటెక్టెడ్ వాటర్ స్కీం) గురించి అడిగి తెలుసుకొని తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడొద్దని ఈ స్కీంను తిరిగి పునరుద్ధరించేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడం జరిగింద న్నారు. మణుగూరు మండలం ఇరవైండిలో గతంలో సీపీడబ్ల్యూఎఫ్ స్కీం ద్వారా మంచినీటిని సరఫరా జరిగేదని ప్రస్తుత మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని సరఫరా జరుగుతుందన్నడంతో మణుగూరులోని కొన్ని కాలనీలకు మంచినీరు అందడం లేదన్నారు. అప్పట్లో ఐదు రూపాయల నుండి 6 కోట్లతో సీపీడబ్ల్యూఎఫ్ స్కీంను ఏర్పాటు చేసి గ్రామాలకు తాగునీటిని అందించడం జరిగిందని, అది కాస్త మూలన పడడంతో ఈ పరిస్థితి ఎదురైందన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత మిషన్ భగీరథ ఐటీసీ అధికారులను పిలిపించి ఈ స్కీమ్ తీరుతెన్నులపై సమీక్ష చేయడం జరిగిందని త్వరలోనే సీపీడబ్ల్యూఎఫ్ స్కీం పునర్ధరించి మణుగూరులోని అన్ని కాలనీలకు మంచినీటిని సరఫరా జరిగేలా ఇటు మిషన్ భగీరథ అంటూ ఐటీసీ అధికారులతో మాట్లాడినట్టు తెలిపారు. అలాగే రెండు మూడు రోజుల్లో సంబంధిత అధికారులు ఆ స్కీంకి సంబంధించి అంశాలను అక్కడికి వెళ్లి పరిశీలించాలని సూచించారు. ప్రస్తుతం మణుగూరులో సమితి సింగారం అశోక్ నగర్ సుందరయ్య నగర్ ఒక మంచినీటి ట్యాంకు ద్వారా నీటిని అందించడం జరుగుతుందన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఐటీసీ హెచ్ఆర్ హెడ్ శాంకిరణ్, అడ్మిన్ మేనేజర్ చెంగల్ రావు, మిషన్ భగీరథ గ్రిడ్ డీఈ మహేంద్ర రెడ్డి, మిషన్ భగీరథ గ్రీడ్ ఏఈ ప్రశాంత్, ఇంట్రా డీఈ బ్రహ్మదేవ్, ఇంట్రా ఏఈ రవితేజ తదితరులు పాల్గొన్నారు.