Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
మండలంలోని వనవాసి కళ్యాణ పరిషత్ కొమరం భీమ్ విద్యాలయం విద్యార్థులకు శుక్రవారం సీనియర్ జర్నలిస్ట్ జవ్వాది మురళీకృష్ణ రూ.10,500 విలువగల 8 పరుపులను వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమ శిక్షణతో చదివి ఉన్నత స్థితికి చేరుకోవాలన్నారు. ఇటీవల పాఠశాలను సందర్శించిన సందర్భంలో చెక్క మంచాలపై పడుకోడాన్ని చూసి వారికి పరుపులను అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు. జవ్వాది కుటుంబం నిరుపేద విద్యార్థులకు, పేదలకు సేవా కార్యక్రమాలను చేస్తూ ఆర్థిక చేయూతనందిస్తుందని ఆయన అన్నారు. కొమరం భీమ్ విద్యాలయం విద్యార్థులకు పరుపులను అందజేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. గత ఏడాదిన్నర సంవత్సరంలో పేద విద్యార్థులకు, క్రీడాకారులకు, గోదావరి వరద బాధితులకు 3 లక్షలకు పైగా ఆర్ధిక సహాయం చేసామని వెల్లడించారు. ఇటువంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తు లోనూ కొనసాగించను న్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జవ్వాది కుటుంబ సభ్యుడు శ్రీనివాసరావు, పటేల్ వెంకటేశ్వర్లు, రాంలక్ష్మన్, కొమరం భీం విద్యార్థి నిలయం బాద్యులు కోరం సూర్యనా రాయణ, శోభన్, స్వరూప పాల్గొన్నారు.