Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కరకగూడెం
ఏజెన్సీ ప్రాంత ప్రజలకు నీటి కొరత లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామంలో మండల పరిషత్ ప్రత్యేక నిధుల నుంచి సుమారు రూ.లక్ష యూబై వేల వ్యయంతో బోర్ వెల్ పనులను విప్ రేగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసి దేశంలోనే సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇర్ప విజరు కుమార్, ఎంపీటీసీ కొమరం మునేంద్ర, ఉప సర్పంచు చేను సాంబయ్య, యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్, మలకం వెంకటేశ్వర్లు, ఇర్ప సత్యం, బట్ట బిక్షపతి, కుంజ లక్ష్మయ్య, మోడెం అంజయ్య, మలకం పుల్లయ్య, గ్రామ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.