Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఓటు జీఎం డి.లలిత్ కుమార్
నవతెలంగాణ-మణుగూరు
యోగా, ధ్యానంతో మానసిక ఒత్తిడిని జయించవచ్చని ఏరియా ఎస్ఓటు జీఎం డి.లలిత కుమార్ అన్నారు. శుక్రవారం హార్ట్ ఫుల్ నెస్ ఇన్స్టిట్యూట్, శ్రీ రామ చంద్ర మిషన్, ప్రభుత్వ సాంస్కృతిక శాఖల సమర్పణలో హర్ దిల్ ద్యాన్, హర్ దీస్ వ్యాన్ పేరిట పైలట్ కాలనీ ఎంవిటీసీ నందు మూడు రోజులుగా జరిగిన యోగా మహౌత్సవ ఉచిత శిక్షణ నిర్వహించారు. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రతి రోజు యోగా ధ్యానంతో షుగర్, బీపీ, మానసిక ఒత్తిడిని నివారించుకోవచ్చు తద్వారా ప్రశాంతవంతమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చు అని తెలియజేశారు. ఉద్యోగులకు యోగా ధ్యానంలో ఉచిత శిక్షణ ఇప్పుడు అభినందనీయమని ప్రశంసించారు. అనంతరం జోనల్ కో ఆర్డినేటర్ టివి రమణ మాట్లాడుతూ.. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. యోగా ద్యాన ప్రక్రియల ద్వారా ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటూ విధులను చక్కగా నిర్వర్తించుకోవచ్చు అన్నారు.
ఈ యోగా ధ్యాన కార్యక్రమం ఇలాంటి సందర్భాలలోనే కాకుండా ప్రతి రోజు దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్య లబ్ది పొందాలిసిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంవిటీసీ మేనేజర్ నాగేశ్వర రావు లక్ష్మణ్, లక్ష్మణ్, నోడల్ ఆర్డినేటర్ టి.కృష్ణ, కార్మికులు పాల్గొన్నారు.