Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
ఇటీవల కురిసిన వర్షాల వలన ఇళ్లు కూలిపోయి నిరాశ్రయులైన బాధితులను వెంటనే ఆదుకోవాలని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అధికారులను కోరారు. వర్షాల వలన స్థానిక అల్లూరి సెంటర్ కేఎస్పీ రోడ్ పక్కనగల కేటీపీఎస్ గోడ కూలిపోయి, చెట్లు విరిగి పడి 8 నివాసగృహాలు, షెడ్లు కూలిపోయి నిరాశ్రయులయ్యారు. శుక్రవారం అల్లూరి సెంటర్ వద్ద కొత్వాలతో పాటు బీఆర్ఎస్ నాయకులు రమణమూర్తి నాయుడు కలిసి భాదితులను పరామర్శించారు. ఈ సందర్భంగా కొత్వాల ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్‌లతో ఫోన్లో మాట్లాడారు. అధికారులు వెంటనే నిరాశ్రయులైన బాధితులను ఆదుకోవాలని కోరారు. కడుబీదవారైనందున, తినడానికి తిండి లేనందున వారికీ బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రమణమూర్తి నాయుడు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.