Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి మండలం చీమలపాడులో ఈనెల 11న నిర్వహించే బీఆర్ఎస్ అత్మీయ సమ్మేళనంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అత్మీయ సమ్మేళన ఏర్పాట్లను శుక్రవారం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పర్యవేక్షించారు. చీమలపాడులో నిర్వహించే అత్మీయ సమ్మేళనంలో చీమలపాడు, తొడితలగూడెం, రేలకాయలపల్లి, గేట్రేలకాయల పల్లి, జైత్రాంతండా, పాటిమీదిగుంపు, టేకుల గూడెం, బాజుమల్లాయిగూడెం, బోటితండా, నానునగర్తండా పంచాయతీల బీఆర్ఎస్ కార్యకర్తలు హాజరుకానున్నారు. దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంపీపీ మాలోత్ శకుంతల కిషోర్, బీఆర్ఎస్ అధ్యక్షప్రధాన కార్యదర్శులు పెద్దబోయిన ఉమాశంకర్, ఇస్లావత్ బన్సీలాల్లు తెలిపారు. వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, ఇతర పార్టీ, ప్రభుత్వ పెద్దలు హాజరు కానున్న ఈ సమ్మేళనంలో రానున్న ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేయటం, ప్రతిపక్షాల కుట్రలను ప్రజలకు తెలియజేయటం ఈ సమ్మేళన ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈకార్య క్రమంలో మాజీ ఆత్మకమిటి చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సంత చైర్మన్ అడ్డగోడ ఐలయ్య, ఎంపీటీసీ ధారావత్ పాండ్య నాయక్, సర్పంచ్లు మాలోత్ కిషోర్, బాణోత్ కుమార్, బాణోత్ శంకర్, నాయకులు అజ్మీర వీరన్న, తోటకూరి పిచ్చయ్య, దాచేపల్లి కష్ణారెడ్డి, అడపా పుల్లారావు, గణితి ముత్యాలరావు, మండెపూడి కోటేశ్వరరావు, రమేష్, కేలోత్ పంతులు, చందర్, ప్రసాద్ పాల్గొన్నారు.